ఈసారి జగన్ దెబ్బ రైతులపై !!

January 24, 2020

రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామ వాలంటీర్ల కాన్సెప్ట్ మీద ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. ఆగ‌స్టు 15 నాటికి గ్రామ వాలంటీర్ల‌ను ఎంపిక పూర్తి చేసి.. వారికి అపాయింట్ మెంట్ లెట‌ర్లు ఇచ్చేందుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్ ఇప్ప‌టికే విడుద‌ల చేయ‌సిన సంగ‌తి తెలిసిందే.
ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. గ్రామ వాలంటీర్ల ఎంపిక చేసి.. వారికి అపాయింట్ మెంట్ ఇవ్వ‌టం ఆల‌స్యం వారికి చేతి నిండా ప‌ని సిద్ధంగా ఉంద‌ట‌. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స్వ‌యంగా చెప్పారు. వాస్తవానికి ఈ ఏడాది రైతులకు జగన్ హ్యాండిద్దాం అనుకున్నారు. కానీ విమర్శలు రావడంతో 2020 మేలో ఇవ్వాలనుకున్న వైఎస్సార్ రైతు భ‌రోసా ప‌థ‌కాన్ని ఈ అక్టోబ‌రులోనే ఇవ్వ‌నున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు. అక్టోబ‌రులో స్టార్ట్ అయ్యే ర‌బీ సీజ‌న్ లోనూ ప్ర‌తి రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు.
ట్విస్ట్ ఏంటంటే... తాము అందించే రైతుభ‌రోసా మొత్తాన్ని గ్రామ వాలంటీర్ల చేత పంపిణీ చేస్తామ‌న్నారు. అంటే రైతులు ఇక వాళ్ల చుట్టూ చక్కర్లు కొట్టకతప్పదు. ఊర్లో రాజకీయాలు ఎలా ఉంటాయో తెలిసిందే గా. ఇందులో ఇంకో ట్విస్ట్ ఉంది. రైతు భరోసా కౌలు రైతులకు వర్తిస్తే అసలు రైతులకు వర్తించదు. స్పష్టమైన ఆదేశాలు లేదు గాని అలా అర్థమొచ్చేలా మాట్లాడారు ముఖ్యమంత్రి.
కౌలు రైతులను గుర్తించడానికి స్టాంపు పేప‌ర్ ఫార్ములా మాదిరి ఒక ప‌త్రం ఉంటుంద‌ని.. దాన్ని రైతుల కోసం గ్రామ స‌చివాల‌యంలో ఉంచుతామ‌ని.. 11 నెల‌ల కాలానికి భూమిపై హ‌క్కులు కాకుండా.. పంట సాగు చేసుకునేలా అనుమ‌తులు ఇచ్చేందుకు వీలుగా రైతుల నుంచి కౌలు రైతుల‌కు పత్రాలు అందేలా చూడాల‌న్న‌దే ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా చెబుతున్నారు. దీంతో.. రైతుభ‌రోసా మొత్తం పంట పండించే కౌలురైతుల‌కు అందుతుంద‌న్నారు. రైతు భ‌రోసా కింద బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీ కౌలురైతుల‌కు కూడా రూ.12,500 ఇస్తామ‌ని చెప్పారు జ‌గ‌న్‌. అంటే పొలం ఉన్న రైతుకు గుండు సున్నా... కౌలు రైతుకు మాత్రం డబ్బులు. అంటే ఈ లెక్కన పేద రైతులకు కౌలుకు భూమి దొరక్కుండా చేసేలా ఉన్నాడు జగన్. ఇది ఎన్ని వివాదాలకు దారితీస్తుందో.