ఇంత సూపర్ లవ్ స్టోరీ మీ జన్మలో విని ఉండరు

July 13, 2020

ఇలాంటి తండ్రిని మీరెక్కడా చూసి ఉండరు... అసలు ఇలాంటి మానవత్వం, బాధ్యత ఉన్న వ్యక్తి మీకు కనిపించి ఉండడు. ప్రేమకు ఇంత గొప్ప న్యాయం ఎక్కడా జరిగి ఉండదు. ఇది కనీవినీ ఎరుగని ప్రేమ కథ. సినిమా తీస్తే బాక్సాఫీసులు బద్దలుకొట్టగలిగిన కథ.
ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..
కొట్టాయం జిల్లా తిరునక్కార గ్రామంలో షాజి, అతని కుటుంబ నివసిస్తోంది. కుమారుడు ఇంటర్లోనే ఒకమ్మాయిని ప్రేమించి ఆమెతో లేచిపోయాడు. పోలీసులు పట్టుకొచ్చి పంచాయతీ చేసి మైనర్లు అయిన వారిద్దరిని విడగొట్టారు. కానీ అమ్మాయి తల్లిదండ్రులు లేచిపోయిన పిల్లను ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. ఇది ఆరేళ్ల క్రితం స్టోరీ.
అక్కడ ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నాడు అబ్బాయి తండ్రి. సరే... అమ్మాయిని మా ఇంటికే తీసుకెళ్లి చదివించి పెద్దయ్యాక ఇద్దరికీ పెళ్లి చేస్తా అని పోలీసులకు మాటిచ్చాడు. చావే శరణ్యం అనుకున్న అమ్మాయికి అది ఎంతో ఆనందాన్నిచ్చింది. అయితే కొడుకు కొంతకాలం తర్వాత ఆ అమ్మాయి తనకు వద్దన్నాడు. ఇంకో అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం తెలిసి తండ్రి ఇద్దరినీ తనతో పాటు గల్ఫ్ కు తీసుకెళ్లాడు. అయినా తిరిగొచ్చాక అబ్బాయి తనకు ఇష్టమైన ఇంకో అమ్మాయినే చేసుకున్నాడు.
అంతే తండ్రి షాజికి చిర్రెత్తుకొచ్చింది. ఇంతకాలం అల్లారుముద్దుగా పెంచుకున్న ఆ అమ్మాయికి మరో చక్కటి అబ్బాయిని చూశాడు. అతనికి ఈ స్టోరీ మొత్తం చెప్పి మరీ ఆ అమ్మాయితో ఘనంగా పెళ్లి చేశాడు. అంతేకాదు.. ఆమెకు తనకున్న ఆస్తి మొత్తం రాసిచ్చి కొడుక్కి కోలుకోలేని షాకిచ్చాడు. సాధారణంగా తాత ఆస్తిపై మనవడికి హక్కుంటుంది. కానీ తండ్రి ఆస్తిపై హక్కుండదు. కాబట్టి తండ్రి ఇచ్చిన షాక్ కు ఇంకా షాజి కుమారుడు కోలుకోలేదు.
ఏదేమైనా ఇలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు ఉంటే... ఏ ఆడపిల్ల జీవితం అయినా ఎంతో సంతోషంగా ఉంటుంది. అమ్మాయికి అతనే నిజమైన తండ్రి.