తానా రీజినల్‌ కోఆర్డినేటర్‌ రజినికాంత్‌ కాకర్లకు ఘన సన్మానం

August 06, 2020

బే ఏరియా ప్రవాసులు మరో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తానా నార్తర్న్ కాలిఫోర్నియా రీజినల్‌ కోఆర్డినేటర్‌ రజినికాంత్‌ కాకర్లకు తానా సభ్యులు మిల్పిటాస్‌, కాలిఫోర్నియాలో ఘన సన్మానం చేశారు. బే ఏరియాలోని స్థానిక ప్రతినిధులు ఈ సందర్భంగా నూతన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌ కాకర్లకు శుభాకాంక్షలు తెలియజేసిన జయరాం కోమటి తానా సభ్యులందరితో కలిసి పనిచేయాలని సూచించారు. స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనాలని, నాయకత్వ లక్షణాలతో పైస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇతర సభ్యులు సైతం ఆయనకు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రజినీకాంత్‌ కాకర్ల మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి క్రియాశీలంగా కార్యక్రమాలు చేపడుతామని పేర్కొంటూ ఇందుకు సభ్యులు తమ విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జయరాం కోమటి, భక్త బల్ల, సతీష్‌ వేమూరి, వెంకట్‌ కోగంటి, యశ్వంత్‌ కుడరవల్లి, శ్రీనివాస్‌ వల్లూరిపల్లి, శ్రీకాంత్‌ దొడ్డపనేని, రమన్‌ సంచుల, వీరబాబు ప్రత్తిపాటి, గోకుల్‌ రుచిరాజు, రామ్‌ తోట, భరత్‌ ముప్పిరాల, చంద్ర గుబ్టుపల్లి, శ్రీనివాస వీరపనేని, కోనేరు శ్రీకాంత్‌ మరియు సుబ్బ యంత్ర తదితరులు పాల్గొన్నారు.