చంద్రబాబు నువ్వే రైటు - బాబు దారిలోకి జగన్

August 05, 2020

చంద్రబాబు ఎంచక్కా ఉచిత ఇసుక ఇస్తుంటే దానిని మాఫియా అని ప్రచారం చేసిన ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ప్రజలను పిచ్చోళ్లను చేసింది. జనం కనీసం ట్రాన్స్ పోర్టు ఖర్చు అనేది ఉంటుందన్న విషయం మరిచిపోయారు. అది కూడా ఎవరో తోడుకుని వచ్చి ఇసుకను అమ్మితే ప్రభుత్వం దోచుకుంటోందని ప్రచారం చేశారు. అనుభవం అయితే గాని దాని నొప్పి ఎంత ఉంటుందో వైసీపీకి తెలిసి రాలేదు.

ఇసుకతో వ్యాపారం చేయాలని ప్రయత్నంచి వైకాపా ప్రభుత్వం ఇసుక తుపానుకు అల్లాడిపోయింది. కార్మికులు రోడ్డున పడ్డారు. ఎన్ని పాలసీలు తెచ్చినా, ఏం చేసినా ఇసుక కొరత తీరడం లేదు. దీంతో ప్రభుత్వానికి పిచ్చెక్కిపోయింది. 

చివరకు సొంత ఎమ్మెల్యేలే అయ్యా మాకు ఇసుక ఇప్పించండి లేకపోతే జనం కొడతారు మమ్మల్ని అని వాపోయారు. దీంతో ప్రభుత్వం తలతిక్క నిర్ణయం తీసుకుంది. ఎడ్ల బండిలో తీసుకెళ్లే వారికి ఇసుక ఉచితం అంది. జనం నవ్వుకున్నారు. ఎడ్ల బండ్లు అంతరించిపోయి చాలా కాలం అయిపోయింది. ఊర్లో ఒకటో రెండో ఉంటాయి. ఎంతని తోడుకుంటారు. ఎన్నిసార్లు అని తిరుగుతారు. 

చివరకు ప్రతిపక్షాలు, స్వపక్షాలు, మేధావులు, జనం బండబూతులు తిట్టేటప్పటికి పాలసీలో మరిన్ని మార్పులు చేసింది. ట్రాక్టరులో తీసుకెళ్తే ఇసుక ఉచితం అని చెప్పింది. అయిపాయె. ఇంకే ముంది... ఏపీలో ట్రాక్టరులో ఎక్కడికి తీసుకెళ్లినా ఉచితం... ఇక లారీల వ్యాపారమంతా ఇతర రాష్ట్రాలకు జోరుగా సాగనుంది.

కష్టపడి పాపం వైసీపీ నేతలంతా సలహాలిస్తే జగనన్న మూడు నెలలు మేథో మదనం చేసి రూపొందించిన ఇసుక పాలసీ ఫసక్ అయ్యింది. చివరకు చంద్రబాబు దారిలోకి వచ్చి ఉచిత ఇసుక అంటోంది ప్రభుత్వం. ఇది కేవలం ట్రాక్టర్లకే సుమీ, లారీ లో వేసుకెల్తే డబ్బులు కట్టాల్సిందే. అంటే చివరకు చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీనే ఆ మాట చెప్పకుండా జగన్ అనుసరిస్తున్నారు. 

దిసీజ్ వాస్తవం.