​కేసీఆర్ లో కరోనా భయం పోయింది - ఈ మాటే సాక్ష్యం

August 12, 2020

​ఒకప్పడు కరోనా అంటే ఉలిక్కిపడి భయపడిన కేసీఆర్ ఇపుడు దానిని లైట్ తీసుకుంటున్నాడు. 10 -20 కేసులు వచ్చినా హంగామా చేసిన ముఖ్యమంత్రి ఇపుడు రోజుకు 60-70 వస్తున్నా వ్యాప్తి లేదంటున్నారు. తాజాగా కరోనాపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. 

కరోనా విషయంలో ప్రజల్లో బాగా అప్రమత్తత పెరగడంతో ఎవరికి వారు జాగ్రత్తగా ఉన్నారు. దీనివల్ల కేసులు రోజూ వచ్చినా ప్రభుత్వం ఎదుర్కోదగిన స్థాయిలోనే వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 10 వేల మంది సీరియస్ లక్షణాలున్న వారికి వైద్యం చేయగలిగిన సదుపాయాలు ఉండటం వల్ల ప్రభుత్వం దీనిని ఎదుర్కోవడానికి సదా సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒక వ్యాఖ్య చేశారు... సడలింపులు ఇచ్చినా వ్యాప్తి పెద్దగా లేదన్న మాట ఆయనలో కరోనా భయం పోయిన విషయాన్ని తెలుపుతోంది.

నమోదయ్యే కేసులు 85 శాతం సాధారణంగా ఏ లక్షణాలు లేకుండా ఉన్న కేసులే. మిగతా 15 శాతంలో 10 శాతం సాధారణ జలుబు దగ్గు లాగా ఉంది. 5 శాతం కేసులు మాత్రమే సీరియస్ గా ఉంటున్నాయి. దీనివల్ల లక్ష కేసులు వచ్చినా తెలంగాణ డీల్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉందన్న భరోసా ముఖ్యమంత్రిలో కనిపిస్తోంది. ఎందుకంటే లక్ష కేసులు వచ్చినా 10 శాతం మందికి మాత్రమే హాస్పిటల్ వైద్యం అవసరం కాబట్టి... లాక్ డౌన్ అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వ్యాపారాలకు మరిన్ని సడలింపులు ఇచ్చింది.

ప్రజలు జాగ్రత్తగా ఉండి తమ ఆరోగ్యాలు కాపాడుకోవాలని... నలుగురిలో కలవడం తగ్గించుకోవాలని, అవసరానికి మాత్రమే బయటకు వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. అన్ని వ్యాపారాలు చేసుకోవచ్చని, అయితే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. కరోనాతో సహజీవనం తప్పదు. కాబట్టి కట్టడి చేసుకుంటూ బతకాల్సిందే అన్నా కేసీఆర్. 

జిల్లాలను కరోనా ఫ్రీ చేసినా... సడలింపుల వల్ల మళ్లీకరోనా జిల్లాలకు చేరింది. అయితే ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది గాని భయపడటం లేదు. ప్రజలను అప్రమత్తం చేస్తూ వైద్య సదుపాయాలు కల్పిస్తోంది.