ఐకియాలో అగ్నిప్ర‌మాదం

July 06, 2020

యూర‌ప్ బేస్డ్ ఫ‌ర్నీచ‌ర్ స్టోరీ ఐకియా-  హైద‌రాబాద్ లో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. జ‌నంతో బాగా ర‌ద్దీగా ఉండే ఆదివారం రోజు అగ్నిప్రమాదం జ‌రిగినా ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డం ఊర‌ట క‌లిగింది. అయితే ప్ర‌మాదం జ‌రిగింది షాపింగ్ ఏరియాలో కాదు. సెల్లార్ వన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వినియోగ‌దారులు ఆందోళనకు గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే వెంటనే స్పందించిన ఐకియా సిబ్బంది మంటలను చాక‌చ‌క్యంగా ఆర్పేశారు.

ఇక హైద‌రాబాద్ ఐకియా బ్యాడ్ న్యూస్‌తో వార్త‌ల్లోకి రావ‌డం ఇది మూడోసారి. మొద‌ట రెండు సార్లు బిర్యానీలో పురుగులు రావ‌డం వ‌ల్ల వార్త‌ల్లోకి వ‌చ్చి కొంత డ్యామేజ్ అయ్యింది. దీంతో ఆ మెనులో కొన్ని నెల‌ల పాటు బిర్యానీయే అమ్మ‌డం మానేశారు. తాజాగా అగ్నిప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో మ‌రోసారి వార్త‌ల‌కెక్కింది.

గ‌త ఆగ‌స్టులో ఈ స్టోర్ ప్రారంభ‌మైంది. ఐకియా కు ఇది ఇండియాలో ఉన్నఏకైక స్టోర్‌. తొలిరోజుల్లో అయితే దీనికి ప‌ర్యాట‌క కేంద్రానికి వ‌చ్చిన‌ట్టు జ‌నం త‌ర‌లివ‌చ్చి ట్రాఫిక్ జాం కూడా అయ్యింది. నాలుగైదు గంట‌లు క్యూ లైన్ వెయిటింగ్ ఉండేది. ఆ త‌ర్వాత ర‌ద్దీ కొన్నాళ్ల‌కు త‌గ్గినా ఇప్ప‌టికి రెస్పాన్స్ బాగానే ఉంద‌ని చెబుతున్నారు.