హైదరాబాదులో ... పెట్రోల్ బంకులో తగలబడిన కారు

February 27, 2020

పెట్రోలు బంకులో నో స్మోకింగ్, నో ఫోన్. ఎందుకంటే ఏ చిన్న స్పార్క్ వచ్చినా చాలా ప్రమాదమని... అలాంటిది పెట్రోలు బంకులో ఏకంగా ఒక కారును మంటలు వస్తే...

ఆ మంటలు పెట్రోలు బంకులో 20 నిమిషాలు రగులుతూనే ఉంటే...

మంటలు పెట్రోలు బంకులో సీలింగు దాకా ఎగిరి పడితే... 

అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. మిగతా ఎక్కడైనా మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు గాని పెట్రోలు బంకులు ఎవరూ సాహసం చేయలేకపోయారు. అసలు ఆ అనుభవమే భయంకరం.

కానీ అక్కడున్న వారంతా ఎంత అదృష్టవంతులంటే... పెట్రోలు బంకుకు ఏం కాలేదు. అందరూ క్షేమం. అంతసేపు మంటలు ఎగిరినా బంకులో ఉన్న పెట్రోలు తో ఎక్కడా అవి కలవలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. బహుశా చరిత్రలో పెట్రోలు బంకులో ఇలా అగ్నిప్రమాదం జరిగినా.. పెట్రోలు బంకు సేఫ్ గా ఉండటం ఎవరూ ఊహించి కూడా ఉండరు. ఇది ఊహకందని ప్రమాదమే.