బాలయ్య టీజర్ - ఏపీ మంత్రిపై సంచలన డైలాగ్

August 05, 2020

నందమూరి బాలకృష్ణ అభిమానులకు పుట్టిన రోజు బహుమతి ఇచ్చేశాడు. బోయపాటి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమాపై ఈరోజు ఇంటర్నెట్లో మారు మోగుతోంది. మంగళవారం సాయంత్రం 7 గంటల తర్వాత విడుదలైన #BB3 టీజర్ వైరల్ అవుతోంది. బాలయ్య అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఈ టీజర్ ఉండటం విశేషం.

ఇటీవల ఏపీ మంత్రి ఒకరు ‘సన్నబియ్యం‘ గురించి మాట్లాడుతూ అమ్మమొగుడు అంటూ మీడియా ముందు దిగజారుడు భాష మాట్లాడారు. అది బాగా వైరల్ అయ్యింది. ఈరోజు విడుదలైన ఈ టీజరులో అదే ప్రధాన డైలాగ్. ఎలా మాట్లాడాలో నేర్చుకో... శ్రీను గారు మీ నాన్న బాగున్నారా ? అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారా? అనడానికి చాలా తేడా ఉంటుందిరా ...లం..డీ... కొడ... కా అంటూ ఒకడ్ని కొట్టే షాట్ తో టీజర్ కట్ చేశారు. ఇది బాలయ్య అభిమానులకు విందులా ఉంది.

బ్యాగ్ గ్రౌండ్ స్కోరు, డైలాగు చూస్తుంటే... ఈ టీజరు సినిమా పై బాగా అంచనాలు పెంచేలా ఉంది. Boyapati srinu తో Balakrishna మూడో సినిమా ఇది. #BB3 అంటూ ఈరోజు నెట్లో ఒకటే సందడి.