స్టేజ్ మీద తొలిసారి మహేశ్ సినిమా డైలాగ్ ఇదే

July 05, 2020

మిగిలిన హీరోలకు భిన్నంగా ఉంటుంది మహేశ్ బాబు తీరు. పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వటం ఆయనకు ఇష్టముండదు. భారీ డైలాగులు చెప్పారు. హడావుడి చేయరు. గొప్పలు చెప్పరు. సింఫుల్ గా ఉంటారు. ఆచితూచి అన్నట్లు మాట్లాడతారు. పొగడ్తలతో ముంచెత్తటం కూడా పెద్దగా రాదు. అన్నింటికి మించిన ఇంత సుదీర్ఘకాలం అగ్రనటుడిగా ఉన్నప్పటికి.. ఆయనెప్పుడు స్టేజ్ మీద సినిమా డైలాగులు చెప్పింది లేదు.
అందుకు భిన్నంగా తొలిసారి స్టేజ్ మీద డైలాగు చెప్పి ఆశ్చర్యానికి గురి చేశారు మహేశ్ బాబు. సంక్రాంతి పండుగ వేళ.. సరిలేరునీకెవ్వరుమూవీతో గ్రాండ్ సక్సెస్ సొంతం చేసుకున్న ఆయన మాంచి ఊపు మీద ఉన్నారు. శుక్రవారం వరంగల్ లో సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ఈవెంట్లో రోటీన్ కు భిన్నంగా వ్యవహరించిన మహేశ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఎవరిపైనా విమర్శలు చేయటం.. చురకలు వేయటం లాంటివి చేయని మహేశ్.. ఈసారి అందుకు భిన్నంగా వ్యవహరించారు. తాను ఎప్పుడూ స్టేజ్ మీద సినిమా డైలాగులు చెప్పలేదని.. తాజాగా ప్రేక్షకులు ఇచ్చిన సక్సెస్ వేళ.. తాను డైలాగ్ చెబుతానని చెప్పటం ఆశ్చర్యానికి గురి చేసింది.
తనకీ సంక్రాంతి ఎప్పటికి గుర్తిండిపోతుందని.. తన తండ్రి అభిమానులు.. తన అభిమానులు తన నుంచి ఎలాంటి సినిమాను అయితే కోరుకుంటారో అలాంటి సినిమాను అనిల్ రావిపూడి ఇచ్చారన్నారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా స్టేజ్ మీద డైలాగ్ చెప్పకుంటే ఎలా అంటూ.. సరిలేరునీకెవ్వరు డైలాగును చెప్పారు. ‘‘మీ ప్రేమకు.. మీ అప్యాయతకు.. మీ అభిమానానికి.. టేక్ ఎ బౌ’’ అంటూ ఫ్యాన్స్ ను సంతోషంతో ముంచెత్తారు మహేశ్.