సంచలనం - ఏపీకి ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు

May 26, 2020

రేపు మంత్రి వర్గం ఏర్పాటు ప్రక్రియలో భాగంగా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అతిపెద్ద జంబో కేబినెట్ ను 25 మందితో ఏర్పాటుచేయడమే కాకుండా రెండున్నరేళ్ల తర్వాత చాలా మంది పదవులు మారుతాయి అని స్పస్టంచేశారు. దీంతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా ఐదు సామాజిక వర్గాలకు ఐదు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు కేటాయిస్తున్నట్లు జగన్ చెప్పారు. ఇలా ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్న తొలి రాష్ట్రంగా ఏపీ చరిత్రకెక్కనుంది.
శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్‌ఎల్పీ సమావేశంలో ఆయన పార్టీ ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.ఇందులో జగన్ పలు సంచలన ప్రకటనలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపుల నుంచి ఐదు డిప్యూటీ ముఖ్యమంత్రులను ఎంపిక చేస్తారు. అత్యంత ఉన్నత స్థానాల్లో సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పిండం రాజకీయంగా జగన్ కి ఉపయోగపడేదే గాని ఆ వర్గాలకు దీనివల్ల ప్రత్యేకంగా ఏం మేలు జరగదు. 25 మంది కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలుంటారని జగన్ ప్రకటించారు.