ఆ రోజున ఆ రెండు విమానాల్లో ట్రావెల్ చేసినోళ్లు గజగజ

August 12, 2020

వినేందుకు విచిత్రంగా ఉన్నా.. తాజాగా అలాంటి ఆదేశమే ఒకటి చేస్తోంది చెన్నై మహానగర కార్పొరేషన్. మార్చి 24న దేశ రాజధాని ఢిల్లీ నుంచి చెన్నై మహానగరానికి వచ్చిన రెండు విమానాల్లో ప్రయాణించిన ప్రయాణికులంతా వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాల్సిన అవసరం ఉందని వార్నింగ్ ఇచ్చేశారు. అంతేకాదు.. ఆ రెండు విమానాల్లో ప్రయాణించిన వారు వెంటనే సామాజిక దూరాన్ని పాటించాలని.. వారి ఆరోగ్యం బాగున్నా.. జాగ్రత్తలు తీసుకోవాలన్న హెచ్చరికలు జారీ చేశారు.
మార్చి 24న మధ్యాహ్నం 3.15 గంటలకు ఢిల్లీలో బయలుదేరిన ఇండిగో విమానం సాయంత్రం 6.15 గంటలకు చెన్నై చేరుకుంది. అదే రోజు సాయంత్రం 6.25 గంటలకు ఢిల్లీ నుంచి చెన్నైకు బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానంలో ప్రయాణించిన వారు సైతం కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెన్నై కార్పొరేషన్ స్పష్టం చేసింది.
తాజాగా చెన్నై మహానగరంలో బయటకు వస్తున్న కేసుల్లో అత్యధికంగా ఈ విమానాల్లో ప్రయాణించిన వారి ట్రావెల్ హిస్టరీ ఉండటంతో ఈ తరహా హెచ్చరిక చేశారు. మర్కజ్ కు వెళ్లిన పలువురు ఈ రెండు విమానాల్లో ప్రయాణించటం.. వారిలో ఎక్కువమందికి కరోనా పాజిటివ్ గా తేలిన నేపథ్యంలో..  ఈ రెండు విమానాల్లో ప్రయాణించిన వారు కరోనా టెస్టుల్ని వెంటనే చేయించుకోవాలని కోరుతున్నారు.