వీడియో... కరోనాకు ముందు, కరోనా తర్వాత

August 04, 2020

మనదేశంతో పోలిస్తే ఐరోపా దేశాలు చాలా చాలా  చిన్నవి. ఎకానమీ సైజు మనకంటే పెద్దది కాని... విస్తీర్ణం, జనాభా రీత్యా యూరప్ దేశాలు మన రాష్ట్రాల కంటే చిన్నవి. అందుకే యూరప్ మొత్తానికి ఒక ప్రధాన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్ చేసింది. అయితే... అక్కడి ఎకానమీ కి తగ్గట్టే విమాన ప్రయాణాలు విరివిగా చేసేవారు. నిరంతరం బస్సులు తిరిగినట్టు తిరిగేవి. పైగా వీసా నింబంధనలు ఆయా దేశాల మధ్య చాలా అరుదు. అందుకే మనం బస్సులో ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోయినట్టు వారు నగరాల మధ్య, దేశాల మధ్య తిరిగేవారు. దీనివల్ల విపరీతమైన ఎయిర్ ట్రాఫిక్ ఉండేది. ఇపుడు కరోనా వల్ల అన్నీ బంద్. అన్ని దేశాలు లాక్ డౌన్. కార్గో ఫ్లైట్లు మాత్రమే తిరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలో కరోనా కు ముందు, కరోనా తర్వాత ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉండేదో యూరప్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విడుదల చేసిన ఒక వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదే ఆ వీడియో !