విదేశాల నుంచి వచ్చిన తబ్లీగ్ లు ఏయే రాష్ట్రాలకు వెళ్లారంటే?

August 13, 2020

కరోనా ఉపద్రవాన్ని గుర్తించిన మోడీ సర్కారు ముందస్తుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. దేశంలో ఎప్పుడూ లేనట్లుగా విధించిన లాక్ డౌన్ తో ఎక్కడి వారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. విదేశాల నుంచి వచ్చిన వారితో వ్యాప్తి చెందుతున్న కరోనాను చెక్ పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాయశక్తులా ప్రయత్నిస్తున్న వేళ.. ఊహించని విధంగా నిజాముద్దీన్ లో నిర్వహించిన తబ్లీగీ జమాత్ కు హాజరైన విదేశీయుల దేశంలో కొత్త కలకలానికి తెర తీశారు. దాదాపు పదిహేనుదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు.. వీసా నిబంధనలకు విరుద్ధంగా మత ప్రచారానికి తెర తీయటం సంచలనంగా మారింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే సదస్సుకు హాజరైన పదిహేను దేశాల నుంచి ఎంత మంది వచ్చారన్న విషయాన్నికేంద్రం గుర్తించింది. దీని ప్రకారం.. ఇద్దరు అమెరికన్లు.. ఫ్రాన్స్.. ఇటలీ.. బెల్జియం.. ట్యునీషియా నుంచి ఒక్కొక్కరు.. ఇండోనేషియా నుంచి 172 మంది.. కిర్గిస్థాన్ నుంచి 36 మంది.. బంగ్లాదేశ్ నుంచి 21 మంది మలేషియా నుంచి 12 మంది వచ్చినట్లు గుర్తించారు. వీరే కాక.. అల్జీరియా నుంచి ఏడుగురు.. అఫ్ఘాన్ నుంచి ద్దరు.. ఇరాన్.. సౌదీల నుంచి కూడా హాజరయ్యారని హోంశాఖ తేల్చింది.
మొత్తం 1306 మందిలో 250 మంది ఢిల్లీలో దొరకగా.. ఉత్తరప్రదేశ్ కు 247 మంది.. మహారాష్ట్రకు 154 మంది.. తమిళనాడులో 133 మంది.. తెలంగాణకు 96 మంది.. హర్యాణాకు 86.. బెంగాల్ కు 70.. మధ్యప్రదేశ్ 59.. జార్ఖండ్ 38.. ఆంధ్రప్రదేశ్ 24.. ఉత్తరాఖండ్ 12.. కర్ణాటక 24.. ఒడిషా ఏడుగురు.. రాజస్థాన్ ఐదుగురు.. పంజాబ్ ముగ్గురు వెళ్లినట్లుగా గుర్తించారు. కర్ణాటక.. పంజాబ్ కు వెళ్లిన 27 మంది తమ దేశాలకు వెళ్లిపోయారు. వీరిద్వారా వైరస్ ఎవరికైనా సోకిందా? అన్న అనుమానంతో ఆరా తీస్తున్నారు. తాము విజిటర్ వీసా మీద వచ్చినప్పుడు.. అందుకు భిన్నంగా మత ప్రచారాన్ని ఎందుకునిర్వహించారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.