షాకింగ్ - షీలా దీక్షిత్ ఇక లేరు

July 01, 2020

సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు షీలాదీక్షిత్ శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత గుండెపోటుతో మరణించారు. ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షిత్ గవర్నర్ గా కూడా పనిచేశారు. కాంగ్రెస్ లో తిరుగులేని నేతల్లో ఆమె ఒకరు. కొంత కాలంగా ఆమె హృద్రోగ వ్యాధితో బాధపడుతున్నారు. 81 ఏళ్ల వయసులోనూ ఎన్నికల్లో పోటీ చేసి రికార్డు సృష్టించారావిడ. అయితే, మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ తనకంటే ఎంతో చిన్నవాడైన వ్యక్తి చేతిలో ఎన్నికల్లో పరాజయం పొందారు.
ఆమె ప్రస్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. మొన్నటివరకు ఢిల్లీ పీసీసీ అధ్య‌క్షురాలిగా చేస్తూ అనారోగ్యం వల్లే రాజీనామా చేశారు. ఆమె 1998 నుంచి 2013 వ‌ర‌కు ఢిల్లీ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసి భార‌తదేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే అరుదైన రికార్డు నెలకొల్పారు. ఢిల్లీకి మూడు సార్లు వరుసగా ఎవరూ ముఖ్యమంత్రి కాలేదు. ఇది ఒక రికార్డు అయితే, ఓ మ‌హిళ మన దేశంలో ఏ రాష్ట్రానికి వరుసగా ముఖ్యమంత్రి కాలేదు.
మొన్నటి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ ఎంపీగా పోటీచేసి బీజేపీ అభ్య‌ర్థి మ‌నోజ్‌తివారీ చేతిలో ఓడిపోయారు. షీలాకి ఢిల్లీ రాజకీయాల్లో ఎంత పేరుందంటే... ఆమెపై గెలిచిన తివారీ ఆమె ఇంటికి వెళ్లి పాదాభివంద‌నం చేసి ఆమె ఆశీర్వాదాలు తీసుకున్నారు. షీలా ఇందిరాగాంధీకి ప్రీతిపాత్రురాలు.