ఆ నలుగురు... ఏపీ ద్రోహులు !!

May 26, 2020

నవ్యాంధ్రప్రదేశ్.. తెలుగు నేల విభజన తర్వాత కనీసం రాజధాని కూడా లేకుండా అప్పుల కుప్పతో కొత్త ప్రయాణం ప్రారంభించిన రాష్ట్రం. అన్నింటా అన్యాయమే జరిగిన ఏపీకి కేంద్రం ఇతోదికంగా సాయం చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందనే చెప్పాలి. అదే మాటను నాడు తెలుగు నేలను విభజిస్తున్న సందర్భంగా పార్లమెంటులో దాదాపుగా అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో నినదించాయి. ఏపీకి ఐధేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని హోదాలోని మన్మోహన్ సింగ్ అంటే... అది సరిపోదు పదేళ్ల పాటు ప్రత్యేక హోదాను ఇవ్వాలంటూ నాడు విపక్షంగా ఉన్న బీజేపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ కూ అందరూ జైకొట్టేసిన సీన్ ఇంకా మన కళ్ల ముందే కదలాడుతోంది. మరి ఇప్పుడేం జరుగుతోంది. ప్రత్యేక హోదా కాదు కదా... ప్రత్యేక ప్యాకేజీ మంత్రం పాడిన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ రెంటికీ ససేమిరా అంటోంది. ఏదో కనీ కనిపించని విదిలింపులు తప్పించి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి మోదీ సర్కారు మొండి చెయ్యే చూపిస్తోంది.

ఇలాంటి తరుణంలో ఏపీ వాసులుగా మన నేతలు ఏం చేయాలి? బీజేపీపై ఉమ్మడిగా పోరు సాగించి ప్రత్యేక హోదాను సాధించుకోవాలి. మరి అలా జరుగుతోందా? ఎప్పుడు ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్ర రూపం దాల్చినా... దానిని పక్కదారి పట్టించే కుయుక్తులు ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ కుయుక్తులు పన్నుతున్న వారు వేరెవరో అయితే అదో లెక్క. ఏపీలోనే పుట్టి... ఏపీ పేరు చెప్పుకుని, ఏపీ వాసులుగానే పదవులు పొంది, ఉన్నత స్థానాల్లో వ్యక్తులే ఈ తరహా కుయుక్తులకు పాల్పడుతుండటం నిజంగా మన దౌర్భాగ్యమే. అంటే తిన్నింటి వాసాలను లెక్కించే ఇలాంటి వారిని మనం ఏమంటాం?  ఏపీ ద్రోహులు అంటాం. ఏపీని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వాళ్లు అంటాం. మరి ఇదంతా చేస్తున్న ఆ ఏపీ నేతలు ఎవరు?

ఇంకెవరు... సమయం సందర్భంగ సరిగ్గా చూసుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏపీని సర్వనాశనం చేసేందుకు  కాసుక్కూర్చున్నట్లుగా వ్యవహరిస్తున్న ఓ నలుగురు ఉన్నారు. వారే... సీనియర్ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు, బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. ఏపీ కోసం వీరు పెద్దగా సాధించిందేమీ లేదు. ఏపీకి సంబంధించి ఏదైనా మంచి జరుగుతోందనిపిస్తే మాత్రం వెంటనే ఎంట్రీ ఇస్తారు. వీరి వెనుక ఉన్నదెవరు? వారికి అందిన ప్రయోజనాలు ఏంటనేది ప్రజలకు ఐడియా ఉంది. సాధారణ సమయంలో తమ అడ్రెస్ కూడా కనిపించనంతగా వ్యవహరిస్తూ... ఏపీ సాంతం ఉద్యమంగా కదలాలి  కి ఏదో మంచి జరుగుతుందన్నప్పుడే వీరు ఎంట్రీ ఇస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాల్సిందేనని అంతా నినదిస్తుంటే... ఉండవల్లితో పాటు జీవీఎల్ కూడా అబ్బే... హోదా ఎందుకు? ఎలాగూ కేంద్రం ఇవ్వనంటోంది కదా... ఏవో రాయితీలు అడిగి తీసుకుంటే సరిపోతుంది కదా. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ మోదీ సర్కారుకు మరింతగా మద్దతు పలుకుతున్నారు. ఐవైఆర్ వ్యవహారమూ అంతే. ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలింపు సమంజమేనంటూ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు పలుకుతూ ఐవైఆర్ చేసిన ట్వీటే ఏపీ పట్ల ఆయన వైఖరేంటో తెలియజేస్తోందని చెప్పాలి. ఒక ఐఏఎస్ అధికారికి మూడు రాజధానుల వల్ల కలిగే నష్టం ఐడియా ఉండదా? మరి తెలిసి కూడా ఏ ప్రయోజనం కోసం దానికి మద్దతు పలుకుతున్నారు? ఇక రమణ దీక్షితులు సంగతి సరేసరి. ఏపీని నిత్యం నిప్పులు కుంపటిలా మార్చేందుకు ఈయన ఒక్కరుంటే చాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రంగంలోకి దిగి దుష్ర్పచారంలో భాగమై... ఏపీ ఆగమైపోవడానికి తనవంతు కృషి చేస్తూంటారీయన.  కొండ మీద స్వామి వారి ప్రయోజనాల కంటే... ఈయన ఇగోనే ఈయనకు ఇంపార్టెంటు.  ఈ నలుగురు ఏపీ పాలిట ద్రోహులుగా మారిపోయారు. ఏపీ అభివృద్ధి కంటకులుగా మారి ఏపీ యువత భవతకు స్పీడ్ బ్రేకులవుతున్నారు.