నలుగురు సాయుధ మావోయిస్టులు అరెస్ట్

July 12, 2020

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో సాయుధులైన నలుగురు మావోయిస్టులను భద్రతాదళాలు పోలింగ్ రోజున అదుపులోకి తీసుకున్నాయి. గురువారం ఉదయం సరిగ్గా పోలింగ్ ప్రారంభానికి ముందు బెంద్రే ప్రాంతంలో వీరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి మూడు నాటు తుపాకులను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. తొలిదశ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా మొత్తం 91 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజాపూర్ ఉంది. ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ఒక్కచోటే 80వేల మంది భద్రతా సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటైంది.