​మోడీ కి నో... కేసీఆర్ సంచలన నిర్ణయం ?

June 01, 2020

కేసీఆర్ రిస్క్ చేస్తాడు. కానీ డైరెక్టుగా జనానికి సంబంధించిన దాంట్లో రిస్కు చేయడానికి కేసీఆర్ ఏ నాడూ ధైర్యం చేయడు. ఎవరితో అయినా పెట్టుకుంటాడు గాని ప్రజలతో పెట్టుకోడు కేసీఆర్. ధైర్యంగా కనిపిస్తూనే ఎక్కువ భయపడే నాయకుడు కేసీఆర్. ముఖ్యంగా ప్రజల మనస్తత్వం బాగా అంచనా వేయగలిగినోడు. అందుకే మోడీ చేసిన రిస్కు చేయడానికి కేసీఆర్ ముందుకు రావడం లేదు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం కేసీఆర్ 20వ తేదీ నుంచి మోడీ ఇచ్చిన లాక్ డౌన్ సడలింపులు వాడుకోవడానికి సిద్ధంగా లేడు. 

ఇప్పటికే లాక్ డౌన్ విషయంలో ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చిన కేసీఆర్ 19వ తేదీ మరోసారి కేబినెట్ మీటింగ్ ఏర్పాటుచేసి చర్చించనున్నారు. తన అభిప్రాయాలు మంత్రులతో, ఉన్నతాధికారులతో పంచుకుని వాళ్ల అభిప్రాయం కూడా విన్నాక ఫైనల్ డెసిషన్ లో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉంది. పట్టణాలు, నగరాల్లో సడలింపులతో లాక్ డౌన్ కంటిన్యూ చేయడం కష్టమన్నది కేసీఆర్ అభిప్రాయం. ఒకదానికి ఒకటి లింకు ఉన్న నేపథ్యంలో... కొన్ని రంగాలకే అనుమతి ఇవ్వడం కుదరదు అని... అలా ఇచ్చినా ప్రాక్టికల్ గా కొందరిని అదుపుచేయలేమన్నది కేసీఆర్ ఆలోచన. 

వ్యవసాయ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగం మాత్రమే మినహాయింపు ఇస్తే సరిపోతుంది. అవన్నీ కాలపరిమితికి సంబంధించిన విషయాలు కాబట్టి మినహాయింపు తప్పనిసరి. కానీ పట్టణాలు, నగరాల సంగతి అలా కాదు. పోలీసు యంత్రాంగం లాక్ డౌన్ పార్సియల్ గా అమలు చేయలేదు అని భావించిన కేసీఆర్... మోడీ ఇచ్చిన సడలింపులు పక్కన పెట్టి మే 3 వరకు పూర్తి స్థాయి లాక్ డౌన్ పెట్టడానికి కేసీఆర్ మొగ్గు  చూపుతున్నట్లు తెలుస్తుంది. మహా అయితే... కేసుల్లేని గ్రామాలకు సడలింపులు ఇచ్చి పట్టణాలు నగరాలను సీల్ చేయనున్నట్లు తెలుస్తోంది? ఒకరకంగా కేసీఆర్ ఆలోచన మంచిదే అని చెప్పొచ్చు.