ఇదేం అజ్జానం సీఎం గారు !

February 24, 2020

ఈసారి ఒకే ఏడాదిలో రెండు సార్లు ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయి. ఇది అరుదైన విషయం. కానీ...పూర్తిగా నదులకు నీరు రానప్పటి కంటే కూడా ఎక్కువ నీటి సమస్య ఇపుడు ప్రకాశం జిల్లాలో నెలకొని ఉంది. ప్రకాశం జిల్లా ప్రాజెక్టుల్లో చుక్క నీరు రాలేదు. తమాషా ఏంటంటే... వీటిని నింపడానికి కృష్నా నుంచి లింకులున్నాయి. కానీ నీళ్లు సముద్రంలోకి వదిలారు గాని ఈ ప్రాజెక్టులను నింపలేదు. ఇది కొత్త ప్రభుత్వం అవగాహనా రాహిత్యానికి, అసమర్థతకు పరాకాష్ట. దీనికి జగన్ సర్కారు చెప్పిన కారణం చూసి జనానికి నవ్వాలో ఏడవాలో తెలీని పరిస్థితి.
ఎందుకు ఈ పరిస్థితి తెలుసా?కృష్ణానది లోకి  భారీ గా వస్తున్న నీరు ఉత్తినే సముద్రంలోకి వెళ్లిపోయింది. అయినా ప్రకాశం జిల్లా రైతుల పొలాలకు తడిఇవ్వడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నాగార్జున సాగర్‌ నుంచి నీటిని గుండ్లకమ్మ రిజర్వాయర్‌ లోకి తీసుకెళ్లే అవకాశం ఉన్నా ప్రభుత్వం తీసుకెళ్లలేదు. చివరకు ఒంగోలు తాగునీటి అవసరాల కోసం చీమకుర్తి సమీపంలో నిర్మించిన రామతీర్థం రిజర్వాయర్‌ నిండకపోవడంతో దిగువ ఆయకట్టులో పంటలు సాగు అలా ఉంచి తాగునీరు అవసరాలు కూడా పూర్తిస్థాయిలో తీరని దుస్థితి ఉంది. ఎందుకిలా చేస్తున్నారు అంటే..  ఈ నీళ్లు వాడుకున్న లెక్కలోకి వేసుకుంటారు అందుకే వాడుకోలేదు అని చెబుతోంది ప్రభుత్వం. సాగర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల గేట్లెత్తేసి నీరంతా వృధాగా సముద్రంలో కలిపేస్తున్నారు కానీ జిల్లాలోని సాగర్‌ ఆయకట్టు భూములకు మాత్రం నీరివ్వడంలేదు. అసలు ఈ లెక్కల తిక్క సంగతి తర్వాత చూడొచ్చు. ఏపీ లెక్కలేసుకుని కూర్చుంటే వరద నీటిని లెక్కలతో సంబంధం లేకుండా తెలంగాణ హాయిగా ఎంజాయ్ చేసి అన్ని ప్రాజెక్టులను నింపుకుంటోంది. అయినా... పై రాష్ట్రాలు లెక్కలు అడిగితే... వారి తప్పులు ఎత్తిచూపడానికి చాలా ఉన్నాయి. ఆ విషయంపై అవగాహన లేకనే జగన్ సర్కారు ఇలా వ్యవహరిస్తోంది. అయినా... ఆ నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రికి గాని,  జలవనరుల మంత్రికి గాని అవగాహన లేదు. వారికే లేకపోతే ఇక అధికారుల్లో తమను ప్రశ్నిస్తారనే భయం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే వారి ఇష్టారాజ్యం అయిపోయింది. పుష్కలంగా నీరుండి కూడా పొలాలు ఎండబెట్టుకునే దుస్థితి ఏపీకి తప్ప ఏ రాష్ట్రానికి రాలేదు.   
కొసమెరుపు - జగన్ తీరుపై ప్రకాశం జిల్లా రైతులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. తక్షణమే మాగాణి సాగుకు నీరివ్వకపోతే ఈ నెల 15 తర్వాత ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి.  

Read Also

జగన్ తీరుపై ఇంగ్లిష్ పేపర్లలో ఎడిటోరియల్స్ ..!
తెలుగుదేశం టార్గెట్ రీచ్ అయ్యింది
దేవులపల్లి అమర్ ఫెయిల్యూర్ స్టోరీ..! నేషనల్ మీడియాలో అంతా నెగెటివ్ ప్రచారమే..!