పవన్ క్రేజును ఇలా వాడుకున్నాడు !!

August 07, 2020

గబ్బర్ సింగ్ 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పవన్ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో గబ్బర్ సింగ్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. రాత్రి బండ్ల గణేష్ జోక్యం చేసుకుని... వెళ్లి పడుకోమంటారా, బాస్ ట్రెండులో నన్ను కూడా కలవమంటారా? అంటూ వ్యాఖ్యానించారు.

తాజాగా పవన్ పలు సినిమాలకు మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ గబ్బర్ సింగ్ జ్జాపకాలు అంటూ ఒక వీడియో షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గబ్బర్ సినిమా సినిమాతో దర్శకుడు హరీష్ శంకర్ రేంజే మారిపోయింది.

ఇక పోతే తాజా వీడియో గురించి దేవి శ్రీ ప్రసాద్ (DSP) ఏమన్నారంటే... ’’గబ్బర్ సింగ్ హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కలిపి సృష్టించిన ఖాకీ, రెడ్ టవల్ మ్యాజిక్ ఓ సంచలన చరిత్ర‘‘ అంటూ తాను  అమెరికాలో నిర్వహించిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో గబ్బర్ సింగ్ పాటను ఎర్రతువాలు, ఖాకీ చొక్కా వేసుకుని పాడిన పాట వీడియో షేర్ చేశారు.
 
(ఇది కూడా చదవండి : వాళ్ల పదేళ్ల కష్టాన్ని పవన్ ఖాతాలో వేస్తున్నారు )
 
ఇదిగో ఆ వీడియో :