NRI: కేరళ స్ఫూర్తి తో తెలుగు రాష్ట్రాలు సిద్ధమవ్వాలి

August 03, 2020

కరోనా  విపత్తు తో ప్రపంచ వ్యాప్తంగా చిక్కుకుపోయిన తెలుగు వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని వారిని స్వదేశానికి రప్పించడంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్  గంప వేణుగోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. విదేశాల్లో ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్న వారు, అత్యవసర వైద్యం కోసం తిరిగి స్వదేశ రావడానికి  గత నెల రోజులుగా  ఎదురు చూస్తున్నారు . కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే  విమాన రాగాల పై అనుమతులు ఇవ్వడం జరిగింది. విధివిధానాలు సూచించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకు క్వారంటైన్ పై సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు.

కేరళ, పంజాబ్, ఢిల్లీ, ఒరిస్సా మొదలగు కొన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల ఎన్నారైలు స్వదేశం వచ్చే వారి వివరాల కోసం పోర్టల్ పెట్టి వివరాలు సేకరణ, క్వారంటైన్ ఏర్పాటు చేయడం, వివరాలన్నీ అందులో పొందుపరచడం జరుగుతోందని చెప్పిన వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రం వెంటనే కేరళ తరహాలో ఎన్నారై ల రాక పై ప్రణాళిక ఏర్పాటు చేయాలని కోరారు. ఎన్నారై మంత్రి కేటీఆర్  వెంటనే  స్పందించి అత్యవసర సర్వీసు ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేయాలన్నారు.
గల్ఫ్ దేశాల నుండి  దాదాపు 150000 మంది యువత  ఉపాధి కోల్పోయి స్వదేశం రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే లండన్ నుండి 500 మంది విద్యార్థులు ,యూరోప్ నుండి మరో 200 మంది విద్యార్థులు  మార్చ్ 20 వ తేదీ స్వదేశ రావడానికి ప్రయత్నించి ఎయిర్  పోర్ట్ కి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. వారి కోసం అనుమతులు ఇవ్వాలని మనవి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి ఎన్నారై ల విషయం లో  పట్టించుకోవడం లేదని, ఇకనైనా తేరుకోవాలని  టీపీసీసీ ఎన్నారై సెల్  యూకే  కన్వీనర్ గంప వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్, సలహాదారులు ప్రవీణ్ రెడ్డి గంగసాని, రాకేష్ బిక్కుమండ్ల ప్రభుత్వాన్ని కోరారు .

టీపీసీసీ చేయూత

50 రోజులుగా యూకే, ఆస్ట్రేలియా, దుబాయ్, న్యూజిలాండ్, బహ్రెయిన్, సౌదీ వివిధ దేశాల్లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు , కార్మికులకు  టీపీసీసీ ఎన్నారై సెల్ నుండి   వందలాది మందికి చేయూత  ఇవ్వడం గమనార్హం.