గాంధీ విగ్రహం ధ్వంసంపై అమెరికా ఏమంది?

August 12, 2020

జార్జ్ ఫ్లాయిడ్ మృతి అమెరికాలో కొత్త చరిత్రను లిఖించడమే కాదు, పాత చరిత్రను గుర్తు చేసింది. ఒక పోలీసు అధికారి క్రూరత్వంతో జార్జి ప్లాయిడ్ మరణించారని అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. రేసిజానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనల్లో శ్వేతజాతీయులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.

అయితే, జాత్యాహంకారానికి నిరసనగా జరుగుతున్న ఈ నిరసనలు కొన్నిచోట్ల పక్కదారి పట్టాయి. దుకాణాలను లూటీ చేయడం వంటి ఘటనలు జరిగాయి. ఈ క్రమంలో వాషింగ్టన్ డీసీలోని ఇండియన్ ఎంబసీలో ఉన్న గాంధీ విగ్రహాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. దీనిపై స్థానిక పోలీసులు విచారణ చేస్తున్నారు.

గాంధీ విగ్రహం ధ్వంసంపై భారతీయులు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. శాంతి దూత అయిన గాంధీ విగ్రహాన్ని హక్కుల కోసం పోరాడుతున్న నిరసన కారులు ధ్వంసం చేశారంటే... ఉద్యమం హింస వైపు మళ్లుతుందన్న విషయాన్ని గమనించాలని కొందరు వ్యాఖ్యానించారు. 

గాంధీ విగ్రహ ధ్వంసంపై ఇండియాలోని అమెరికా అంబాసిడర్ కెన్ జస్టర్ ఏమన్నరాంటే...  ‘‘వాషింగ్టన్ డిసిలోని గాంధీ విగ్రహాన్ని ధ్వంసం అయినందుకు దయచేసి మా హృదయపూర్వక క్షమాపణలను అంగీకరించండి. జార్జ్ ఫ్లాయిడ్ యొక్క భయంకరమైన మరణం మమ్మల్ని కలచివేసింది. అనంతర హింస మరియు విధ్వంసం భయాందోళనలను సృష్టిస్తున్నారు. విధ్వంసాలను, తప్పుడు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. వివక్ష, పక్షపాతం ఏ రూపంలో ఉన్నా దానికి మేము వ్యతిరేకమే. మనందరం త్వరగా ఈ పరిస్థితులను అధిగమించి కోలుకుంటాం అని భరోసాగా ఉన్నాం’’ అని జస్టర్ వ్యాఖ్యానించారు.