వినాయకచవితిపై కరోనా ఎఫెక్ట్.. కాలుష్యం బోర్డు ఎఫెక్ట్

August 11, 2020

చందాలు వేసుకున్న డబ్బులే కదా... ఇష్టారాజ్యాంగా కొందరు యువత పెద్దపెద్ద విగ్రహాలను పెట్టడమే కాకుండా,ధర్మబద్ధమైన హిందు సిద్ధాంతాలకు అనుగుణంగా వేడుకలు చేయడం లేదు.

సినిమా పాటలు, పార్టీలకు వేదికగా గణేష్ ఉత్సవాలను మార్చేశారు.

కరోనా కారణంగా ఇప్పటికే ఈ సారి ఉత్సవాలు పెద్దగా ఉండవని అర్థమైపోయింది. అయితే, కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కేంద్ర కాలుష్య బోర్డు వినాయకచవితి వేడుకలు, గణేష్ నిమర్జన కార్యక్రమాలకు ప్రత్యేక నిబంధనలు రూపొందించింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కొత్త మార్గదర్శకాలు యువతకు ఇబ్బందిగా అనిపించొచ్చు కాని పర్యావరణ పరంగా మేలు చేసే విధంగానే ఉన్నాయి.

ధర్మకోల్, ప్లాస్టిక్ వాడకం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకాన్ని పూర్తిగా నిషేధించారు.

విగ్రహాల నిమజ్జనం కోసం తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేసి, వాటిలోనే నిమజ్జనం చేయాలని సూచించింది.

నిమజ్జనానికి ముందు చేసే ముందు పూలు, విగ్రహంపై ఉన్న ఇతర సామాగ్రి అన్నీ తొలగించి కేవలం విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని తెలిపింది.

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడట పూర్తిగా నిషేధం.

ఎకో ఫ్రెండ్లి సామాగ్రిని మాత్రమే ఉపయోగించాలి. రసాయన రంగులు వాడరాదు.

నిమజ్జనం అనంతరం ఆ సామగ్రి తొలగింపునకు రుసుము వసూలు చేయాలి.