అమెరికాలో తెలుగు పెళ్లి... వెల్లివిరిసిన తెలుగు సంప్రదాయం

August 13, 2020

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అంటూ రాయప్రోలు సుబ్బారావు పిలుపు స్ఫూర్తిని ఎన్నారైలు ఎన్నడూ మరవడం లేదు.

మన భాషను, మన సంప్రదాయాన్ని తెలుగునేలపై నివసిస్తున్న వారికంటే ఎక్కువగా ఎన్నారైలు పాటిస్తున్నారు.

అన్ని తెలుగు పండగలను చేసుకోవడంతో పాటు సంప్రదాయాలను మరవకుండా హిందు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు.

గతంలో కోమటి జయరాం అచ్చ తెలుగు సంప్రదాయాలతో కొడుకు పెళ్లిని ఘనంగా చేసిన విషయం తెలిసిందే. అరిటాకు భోజనాలు పెట్టడం వైరల్ అయ్యింది.

తాజాగా మరో ప్రముఖ ఎన్నారై, మాజీ తానా అధ్యక్షుడు గంగాధర్ నాదెళ్ల తన ఇంట్లో శుభకార్యాన్ని తెలుగు వైభవం కనిపించేలా నిర్వహించారు. 

తన కుమార్తె వివాహాన్ని ఇటీవలే అచ్చ తెలుగు హిందు వివాహ పద్దతిలో జరిపించారు నాదెళ్ల గంగాధర్.

అయితే, కరోనా నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. కానీ కార్యక్రమం మొత్తం తెలుగుదనం వెల్లివెరిసింది. 

ఈ తెలుగు సంప్రదాయ వివాహ బంధంతో నాదెళ్ల కూతురు దీప నాదెళ్ల, ప్రశాంత్ కోవెలమూడి ఒక్కటయ్యారు.

పట్టు వస్త్రాల్లో వధూవరులు గౌరీపూజతో మొదలుపెట్టి చివరికంటా తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుక నిర్వహించారు.

పురోహితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య వేడుక వైభవంగా జరిగింది.

అతిథులు కూడా తెలుగు సంప్రదాయ దుస్తుల్లోనే వివాహ వేడుకకు హాజరయ్యారు.

ఇక విందు కూడా తెలుగు పిండివంటలతోనే నోరూరించింది. 

Read Also

కలకలం: మోహన్ బాబు ఇంటికెళ్లి బెదిరించారు
మదనపల్లె రైతు - ప్రియాంక చోప్రా కామెంట్
షాకింగ్- కరోనాతో ఏపీ బీజేపీ నేత మృతి