వైసీపీ హయాం - గంగిరెడ్డికి బెయిలు

February 19, 2020

మాజీ సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం (అలిపిరి బ్లాస్ట్) కేసుతో పాటు అనేక సంచలన కేసుల్లో ప్రధాని నిందితుడిగా ఉన్న అంతర్జాతీయ స్మగ్లర్‌ గంగిరెడ్డికి బెయిల్ దొరికింది. 2003లో ఏకంగా ముఖ్యమంత్రిని హత్య చేయడానికి చూసినా అతను దర్జాగా తిరిగాడు. తదనంతరం ఏపీలో వైఎస్ అధికారంలోకి రావడంతో ఆ కేసును తోడే ప్రయత్నం ఎవరూ చేయలేదు. ఇక వైఎస్ మరణం తర్వాత తెలంగాణ గొడవలో గంగిరెడ్డిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే 2014లో తెలుగుదేశం అధికారంలోకి రాగానే గంగిరెడ్డి విదేశాలకు పారిపోయి తలదాచుకున్నాడు. అరెస్టు అవుతాను అనే భయం వల్లే అతను అలా చేశాడని వార్తలు వచ్చాయి. చివరకు ఏపీ పోలీసులు అపుడు పట్టుదలతో అతన్ని అరెస్టు చేశారు.
2015లో గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. దొంగపాస్ పోర్టుతో మారిషస్ చేరుకున్నాడు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లే క్రమంలో అక్కడి పోలీసులు రెడ్ కార్నర్ నోటీసు ఉన్న గంగిరెడ్డిని అరెస్టు చేశారు. దీంతో అతన్ని అరెస్టు చేసిన పోలీసులు కడపకు తెచ్చారు. అప్పటి నుంచి జైల్లో ఉండారు. తాజాగా ఈరోజు గంగిరెడ్డికి బెయిలు దొరికింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకే అతను అరెస్టు కావడం, వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే విడుదల కావడం ఇవన్నీ చూస్తుంటే... అనుమనాలు పెరుగుతున్నాయి.