విజయవాడ గ్యాంగ్ వార్... తెరపైకి నాగబాబు పేరు 

July 04, 2020

విజయవాడ గ్యాంగ్ వార్ లో అసలు నిజాలు తెరపైకి వచ్చాయి. ఈ హత్యకు ముందు ఏం జరిగిందనే విషయాన్ని పోలీసులు కూలంకుషంగా వివరంచారు. వీరిదో పెద్ద పంచాయతీ అని ఎవరూ సుద్ధపూసలు కాదని అర్థమవుతోంది పోలీసుల వివరణ బట్టి చూస్తే. అయితే... సడెన్ గా బుట్టా నాగబాబు పేరు ఇందులో కీలకంగా తెరపైకి రావడం విశేషం. 

ఎపుడు ఏం జరిగందన్న విషయాన్ని మన భాషలో సింపుల్ గా చెప్పుకుందాం...

1. విజయవాడలో ప్రదీప్ రెడ్డి - శ్రీధర్ అనే వ్యక్తుల మధ్య రియల్ ఎస్టేట్ వివాదం తలెత్తింది

2. సెటిల్మెంట్ కోసం వీరిద్దరు ప్రదీప్ ప్రయత్నించి బుట్టా నాగబాబు అనే వ్యక్తి వద్దకు వెళ్లాడు.

3. ఈ సెటిల్మెంట్ మీటింగ్ కు ప్రదీప్ రెడ్డి - శ్రీధర్ లతో పాటు పండు - సందీప్ (మృతుడు) హాజరయ్యారు.

4. పండు రావడం సందీప్ కి నచ్చలేదు. నాగబాబు తర్వాత నేను సీనియర్ నువ్వెందుకు మధ్యలో వచ్చావని నిలదీశాడు. 28న ఈ గొడవైంది.

5. సందీప్ ఇంకా చల్లబడలేదు. 29 రాత్రి పండు ఇంటికి వెళ్లి పండు తల్లితో గొడవపడ్డాడు.  అపుడు పండు లేడు. విషయం తెలిసి పండుకి కోపమొచ్చింది.

6. తన గ్యాంగ్ ను తీసుకుని మరుసటి రోజు సందీప్ స్టీల్ దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ సందీప్ లేడు. పని వాళ్లను కొట్టి వచ్చారు.  

7. సందీప్ వచ్చాక ఫోన్ చేసి పండుపై కోప్పడ్డాడు. రారా తేల్చుకుందాం అని ఇద్దరు మే 30న వాగ్వాదం చేసుకున్నారు.

8. అదే రోజు సాయంత్రం 4 గంటలకు రెండు గ్యాంగ్ లు పటమటలోని తోట వారి వీధికి చేరుకున్నాయి.

9. కత్తులు, బ్లేడ్లు, కారం, రాళ్లతో ఇరువురు దాడి చేసుకున్నారు. సందీప్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు.

 

ఇదీ పోలీసులు వెల్లడించిన క్రోనాలజీ. దీన్ని బట్టి చూస్తే... ఇందులో ఎటువంటి రాజకీయం కోణం లేదని.. ఇది విజయవాడ వీధి రౌడీయిజం అని అర్థమవుతోంది.