గంటా వైసీపీలో గంట కొడతాడా?

May 27, 2020

త్వరలో జరిగే గ్రేటర్ విశాఖ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంటూ అక్కడి నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. గంటా చేరిక పైన ఆయన మాజీ స్నేహితుడు..ప్రస్తతు మంత్రి అవంతి శ్రీనివాస రావు నుండే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి రంగంలోకి దిగి..గంటా రాకకు మార్గం సుగమం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే గంటా టీడీపీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరుతారనే ప్రచారం 

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా.గంటా .ఉప ఎన్నికల్లో పోటీ చేయటానికి సిద్దంగా లేరని సమాచారం. అయితే పార్టీలో కీలక పదవి..లేదా ఎమ్మెల్సీ ఇచ్చే విధంగా చర్చలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గతంలోనే టీడీపీలోని కాపు నేతలు కాకినాడలో సమావేశమయ్యారు. వారంతా పార్టీ వీడుతారనే ప్రచారం సైతం సాగింది. కానీ, వారు పార్టీ మారలేదు. ఆ సమావేశానికి గంటా దూరంగా ఉన్నారు. గంటాకు ప్రతిపక్షానికి దక్కే పీఏసీ పోస్టును చంద్రబాబు తనకు కాకుండా పయ్యావుల కేశవ్ కు కేటాయించటం పైనా గంటా మనస్థాపానికి గురైనట్లు ప్రచారం సాగింది. ఇప్పుడు ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటం... విశాఖలో తనకున్న ఇబ్బందుల కారణంగా వైసీపీలోకి వెళ్లటమే మంచిదనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం