ఆ మాటే జగన్ ను గెలిపించింది - గంటా

August 06, 2020

గంటాతో సహా అందరూ ఊహించిన ఓటమి గంటా శ్రీనివాసరావుదే. వరుసగా అన్ని ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న గంటా శ్రీనివాసరావు జగన్ స్వీప్ చేసిన సమయంలోనూ మరోసారి గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు తొలిసారిగా ఓటమి అనంతరం మాట్లాడారు. జగన్ గెలుపు ఎలా సాధ్యమైందో ఆయన చెప్పాడు.

‘‘నన్ను గెలిపించిన విశాఖ నగర ప్రజలకు కృతజ్ఞతలు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. అయినా ప్రజలు మార్పు కోరుకున్నారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని జగన్ ఇచ్చిన పిలుపు ప్రజలను ఎంతో ఆకట్టుకుంది. ఒకసారి చూద్దాం అని జనం భావించారు. అందుకే ఇంత ఘన విజయం ఆ పార్టీకి సాధ్యమైంది’’ అని గంటా వ్యాఖ్యానించారు.

ఈనెల 29వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా పార్టీ పరాజయానికి దారి తీసిన కారణాలు విశ్లేషించుకుంటామని, రాబోయే ఎన్నికల్లో ప్రజల మనసు గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. 

ఇదిలా ఉండగా... ఈసారి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేసి ఉంటే ఓడిపోయేవారు. హుదూద్ విషయంలో విశాఖ ప్రజలు చంద్రబాబును ఎప్పటికీ మరిచిపోరు. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు వైజాగ్ లో ఎంతో అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద ఉన్న కృతజ్జత వల్ల నగర ప్రజలు సైకిల్ కి ఓటు వేయడం వల్ల గంటా గెలిచిపోయారు. లేకపోతే గంటా మిగతా ఎక్కడ నుంచి పోట ీచేసినా ఓడిపోయేవారు.