వైసీపీకి వైజాగ్ లో ట్విస్ట్

April 06, 2020

లోపల జగన్ కి కావల్సిన పనులు చేసిపెట్టడం. పైన అతని పనులను విమర్శించడం. రాష్ట్రంలో జగన్ పాలనను తిట్టడం, కేంద్రంలో జగన్ గుడ్ అనడం... ఇదీ ఏపీలో బీజేపీ వరస. జగన్ లో భయాన్ని బీజేపీ ఎంజాయ్ చేస్తోంది. బీజేపీతో అవసరాన్ని జగన్ తీర్చుకుంటున్నాడు. ఎవరి కోరిక వారిది. ఏది ఏమయినా ఎవరిక ికావల్సింది వారికి నెరవేరుతుంది. 600 కోట్లు ఆదా అంటూ 56 వేల కోట్ల రూపాయల పోలవరం ప్రాజెక్టులో సంకలు గుద్దుకున్న జగన్... 10 వేల కోట్లు ఖర్చుపెట్టిన అమరావతిని మారుస్తానంటే కేంద్రంలోని బీజేపీ జోక్యం చేసుకోదట. వీరిద్దరి నాటకాలు ఏపీ ప్రజలకు అర్థమైనా... వారు ఇప్పటికిపుడు చేయగలిగింది ఏమీ లేక సర్దుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే... తెలుగుదేశం పని అయిపోయిందనుకుని సంబరపడుతున్న వైసీపీ బీజేపీలకు పెద్ద ఝలక్ ఇచ్చారు వైజాగ్ నేత గంటా శ్రీనివాసరావు. జగన్ సొంత మీడియాలో గంటా పార్టీ మారుతున్నాడు అని వార్తలు రాసి సంబరపడిన వైసీపీ వర్గం, టీడీపీ పరిస్థితి చూసి తామే ఓడించినట్లు కితకితలు పెట్టుకుంటున్న బీజేపీ వర్గం రెండింటికీ షాకిస్తూ... 300 మంది బీజేపీ నేతలు అధికార పార్టీని కాదని... గంటా సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. కేంద్రంలో అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీ కాదని... వైజాగ్ వాసులు ఇలా టీడీపీని ఎంచుకోవడం అంటే... ఆ ఇద్దరి పాలనపై జనాభిప్రాయానికి ఇది ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. వారు టీడీపీలో చేరడం ఒక ఎత్తు అయితే... పార్టీ మారతాడు అని ప్రచారం చేసిన గంటా శ్రీనివాసరావు టీడీపీ కేడర్ ను బలోపేతం చేయడం ఆ రెండు పార్టీలకు అసలు మింగుడుపడని పరిస్థితి.

 

ఇప్పటివరకు ఓటమి ఎరుగని గంటా... మొన్నటి ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. సుజనాతో తిరిగినందుకే వారిలాగే బీజేపీలో చేరిపోవడం ఖాయమని పలువురు ప్రచారం చేశారు. కనీసం వైసీపీ తీర్థం పుచ్చుకోవడం అని కూడా రాశారు. కానీ అవి అంతా గ్యాస్ అని తేల్చారు గంటారు. పరిస్థితులు సున్నితంగా గమనిస్తే... స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గాలి గట్టిగా వీచే అవకాశం కనిపిస్తోంది.