గంటా వ‌ర్సెస్ లోకేశ్‌

November 30, 2019

ఏపీ పాలిటిక్స్ వేడెక్కుతున్నాయి.  టీడీపీ, వైసీపీల నుంచి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసే వారి జాబితా విడుద‌ల‌వుతున్నా కొద్ది  రాజ‌కీయాలు ర‌కర‌కాల మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా  టికెట్టు రేసులో ఉన్న వారు త‌మ పేర్లు జాబితాలో లేక‌పోవ‌డంతో నిరాశ‌కు లోన‌వుతున్నారు. పార్టీ పై  ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ పేరు జాబితాలో చేర్చాలంటూ ఒత్తిడి తీసుకువ‌స్తున్నారు. ఎన్నిక‌ల ముందు అన్ని పార్టీలు ఇలాంటి ప‌రిస్థితి స‌ర్వ‌సాధ‌ర‌ణ‌మే. కాని  ఒకే నియోజ‌క‌వ‌ర్గాన్ని ఇద్ద‌రు  అగ్ర‌నేత‌లు కోరుకుంటే మాత్రం వారి మ‌ధ్య స‌యోద్య కుద‌ర్చ‌డం మాత్రం అధిష్ఠానానికి క‌త్తి మీద సాము వంటిదే. ప్ర‌స్తుతం టీడీపీలో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇటీవ‌లె ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు కుమారుడు మంత్రి లోకేశ్ బాబు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్టు భారీగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్ ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డితే త‌న రాజ‌కీయ జీవితానికి బాగుంటుంద‌ని భావించాడు. 2019 ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనే విష‌యం పై ఓ స‌ర్వే చేయించుకున్నాడు. చివ‌ర‌కు భీమిలీ నుంచి నిల‌బ‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్టు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దాదాపు ఇదే ఖ‌రారు అవుతుంద‌ని పార్టీ సీనియ‌ర్లు కూడా అన‌ధికారంగా చెప్పుకొచ్చారు. కాని ఇప్పుడు బీమిలి టికెట్టు టీడీపీలో చిచ్చు పెట్టేలా క‌నిపిస్తోంది. భీమిలి టీకెట్‌ను మొద‌టి నుంచి తాను కోరుతున్న‌ట్టు  మంత్రి గంటా శ్రీనివాస్ బాంబు పేల్చాడు. ఈ విష‌యాన్ని ఇప్ప‌టికే పార్టీ అధినేత చంద్ర‌బాబు ష్టికి కూడా తీసుకువెళ్లిన‌ట్టు ఆయ‌న తెలిపారు. లోకేశ్ బీమిలి నుంచి పోటీ విష‌యం పై త‌న‌కు తెలియ‌ద‌ని మీడియా ద్వారానే తెలిసింద‌న్నారు. అయితే బీమిలి నుంచి ఏ మంత్రి పోటీ చేస్తాడు అన్న‌ది ఆస‌క్తి నెల‌కొంది. లోక‌శ్ సీఎం చంద్ర‌బాబునాయుడికి రాజ‌కీయ వార‌సుడు. అంతే కాకుండా పార్టీ  వ్య‌వ‌హారాల‌ను ప‌ర్యావేక్షిస్తున్న నేత‌. కాబ‌ట్టి అత‌ను కోరుకున్న సీటు ఇచ్చి తీరాల్సిందేన‌ని లోకేశ్ వ‌ర్గీయులు చెబుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాస్  మొద‌టి నుంచి టికెట్టు అడ‌గ‌టంతో సీనియ‌ర్ నాయ‌కుడు కాబ‌ట్టి త‌గిన ప్రాదాన్యం ఉంటుంద‌ని గంటా వ‌ర్గీయులు చెబుతున్నారు.  మ‌రి చంద్ర‌బాబునాయుడు ఏ మంత్రి వైపు మొగ్గు చూపిస్తాడో తెలియ‌లంటే మ‌రో నెల ఆగ‌క త‌ప్ప‌దు.