పెళ్లి నాతో, కాపురం నా ఫ్రెండుతో - షాకిచ్చిన ఎన్నారై వరుడు

August 14, 2020

కొందరి మొహమాటాలు ఇంకొందరి జీవితాన్ని నాశనం చేస్తున్నాయి.

ఒక గుంటూరు వ్యక్తి అమెరికాలో సెటిలయ్యాడు. తల్లిదండ్రుల ఒత్తిడితో పెళ్లికి సిద్ధమయ్యాడు.

సంబంధాలు చూశారు... వరుడు, వధువు ఇద్దరిదీ గుంటూరే

అమెరికా సంబంధం అని... తల్లిదండ్రులు పొలాలమ్మి పెళ్లి చేశారు

అన్ని ఖర్చులు కోటిపైనే దాటాయి. అయినా, అమ్మాయి జీవితం బాగుంటుందని అనుకున్నారు.

కట్ చేస్తే... సీన్ రివర్స్. 

పెళ్లి కొడుకు ఆడాళ్లంటే మోజు లేదు... అతనికి మరో మగతోడు కావాలి,

అది బయటపడకుండా ఉండేందుకే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

ఇది ఎలా బయట పడింది?

మొదటి రాత్రి తనకు ఆరోగ్యం బాలేదన్నాడు. నిజమనుకున్నారు

తర్వాత ఏదో ఒక కారణం చెప్పి ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు.

అమ్మాయికి అనుమానం వచ్చింది. నిలదీసింది. అతని ఇంకోరకం అని బయటపడింది.

ఆ షాకుకే నిశ్చేష్టురాలైన యువతికి మరో పెద్ద షాక్ ఇచ్చాడు.

‘నీకేం పర్లేదు, అమెరికాలో నా ఫ్రెండుతో ఉందువులే‘ అన్నాడు

గుండె పగిలినంత పనయ్యింది అమ్మాయికి.

ప్రతి అమ్మాయి పెళ్లి చుట్టూ ఎన్నో కలలు కంటుంది.

వాటిని తన ప్రమేయం లేకుండా ఎవరో వచ్చి ఛిద్రం చేస్తుంటే ఎంత కుమిలిపోతుంది?

పైగా తల్లిదండ్రులు తమ జీవితాంతం కష్టపడి సంబరంతో కోట్లు ఖర్చుపెట్టి చేస్తే ఇలా జరిగితే తట్టుకోగలరా.

ఇందులో మరో భారీ ట్విస్ట్ ఏంటంటే... నన్నెందుకు పెళ్లి చేసుకున్నావంటే... తన బాయ్ ఫ్రెండ్ కోసం అన్నాడు

అంతేనా... కట్నం వస్తుందని తల్లిదండ్రులు చేసుకోమంటే చేసుకున్నానని చెప్పాడు.

దీంతో యువతి కుటుంబం తీవ్ర వేదనతో కుంగిపోయింది. తల్లిదండ్రుల సహకారంతో కేసు పెట్టింది

గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా... గుంటూరు టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.