అస‌లుసిస‌లు రెడ్లెవ‌రో చెప్పేసిన బైరెడ్డి!

May 31, 2020

ఏపీలో పులివెందుల నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలియ‌నివారుండ‌రు. వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి కుటుంబానికి పెట్టని కోట పులివెందుల‌. 1983లో వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి మొద‌లు 2019లో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ర‌కు పులివెందుల‌లో వైఎస్ కుటుంబానిదే గెలుపు. వైఎస్ఆర్‌, వైఎస్ వివేకానంద‌రెడ్డి, వైఎస్ విజ‌య‌మ్మ‌, వైఎస్ జ‌గ‌న్...ఇలా వైఎస్ కుటుంబం నుంచి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ పులివెందుల ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టారు. 2019లో అయితే, ఏకంగా ల‌క్షా 32 వేల ఓట్ల మెజారిటీతో జ‌గ‌న్ రికార్డు స్థాయిలో విజ‌యం సాధించారు. ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా...గెలుపు వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారిదే. అయితే, అస‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ ఫ్యామిలీ గెలుపు వెనుక ర‌హ‌స్యం ఏమిట‌న్న‌ది రాయ‌ల‌సీమ ప‌రిరక్ష‌ణ స‌మితి వ్య‌వ‌స్థాప‌కుడు బైరెడ్డి రాజ‌శేఖ‌ర రెడ్డి చెప్పేశారు.

ఏపీలో క్యాస్ట్ ఫీలింగ ఎక్కువ‌ని, అదే క్యాస్ట్ ఫీలింగ్‌తో పులివెందుల‌లో వైఎస్ ఫ్యామిలీ గెలుస్తోంద‌ని బైరెడ్డి ఓ ఇంట‌ర్వ్యూలో అన్నారు. ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి అత్య‌ధిక ఓట్లున్న నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల అని, అందుకే అక్క‌డ వైఎస్ ఫ్యామిలీ గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కేన‌ని బైరెడ్డి చెప్పారు. ఈ నియోజ‌కవ‌ర్గంలో రెడ్ల‌కు 95 వేల ఓటింగ్ ఉంద‌ట‌. ఇక్క‌డ అభ్య‌ర్థి రెడ్డి కాకుంటే గ్యారెంటీగా ఓడిపోతాట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం త‌ర్వాత క‌మ‌లాపురం, జ‌మ్మ‌ల‌మ‌డుగు, తాడిప‌త్రిల‌లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నార‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే రెడ్డి సామాజిక వ‌ర్గంపై బైరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను...అస‌లు సిస‌లు రెడ్డిని అని...త‌న వెంట రావాల‌ని పిలుపునిచ్చినా సీమ‌ ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేద‌ట‌. అస‌లు సిస‌లు రెడ్ల క‌థ వేర‌ని వేరని, వారి ధ‌ర్మాలు , గోత్రాలు వేర‌ని చెప్పినా విన‌లేద‌ట‌. అయితే, ఈ ప‌రిస్థితిలో కొంత మార్పు వ‌స్తోంద‌ని, ఏదో ఒక రోజు అసలు నిజాన్ని రెడ్లు తతెలుసుకుంటారని బైరెడ్డి అన్నారు. దీంతోపాటు, ఏపీ సీఎం జ‌గ‌న్, మాజీ సీఎం చంద్ర‌బాబుల‌పై బైరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో మాత్రం..క‌మ్మ, రెడ్డి సామాజిక వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌పూరిత వాతావ‌ర‌ణం ఉంద‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, ఈ ఘ‌ర్ష‌ణ‌ల్లో అంద‌రూ పాల్గొన‌డం లేద‌ని, అయినా....ఆ గొడ‌వ‌తో జ‌నాలు న‌ష్ట‌పోతున్నార‌ని చెప్పారు. ఈ కుల పోరు వ‌ల్ల అభివృద్ధిలో 50 సంవ్స‌తాలు వెన‌క్కు పోతున్నామ‌న్నారు. త్వ‌ర‌లోనే నిరుద్యోగులు, రైతులు, యువ‌కులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు రోడ్ల మీదకు వ‌చ్చి....మా బ్ర‌తుకు మేం బ‌తుకుతాం...ఇక మీ ఇద్ద‌రి పాల‌న గొడ‌వ‌లు చాలు... అని అంటార‌ని జోస్యం చెప్పారు.