ప్రపంచ ఉలిక్కిపడిన ఆత్మహత్య !

August 14, 2020

జర్మనీ... పటిష్టమైన ఆర్థిక పునాదులున్న దేశం. ప్రపంచ కోటీశ్వరులు కొనే కార్లన్నీ తయారుచేసేది ఈ దేశమే. అలాంటి జర్మనీ ఇపుడు కరోనా విలయానికి విలవిలలాడిపోతంది. యూరప్ లో ఒక దేశమైన జర్మలో కరోనా వ్యాధిగ్రస్తులు పెద్దసంఖ్యలో ఉన్నా... తమ సమర్థతతో ఏంజెలా మెర్కెల్ టీమ్ వర్క్ చేసి మరణాల రేటును విపరీతంగా తగ్గించారు. అయితే... ఈరోజు ఆ దేశపు ఆర్థిక రాజధాని అయిన ఫ్రాంక్ ఫర్ట్ నగరం హెస్సీస్ ప్రాంతానికి ఆర్థిక మంత్రి అయిన థామస్ షెఫర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రైలు కు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే... ఈ ఆత్మహత్యకు ముందు సూసైడ్ లేఖ రాసి ఆయన చనిపోయారు. అందులోని కారణం తెలుసుకున్న ప్రపంచం నివ్వెరపోయింది.

కరోనా కారణంగా జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయ్యింది. అది ఇంతటితో ఆగదు. ఇంకా కొనసాగుతుంది. భవిష్యత్తు ఒకటి రెండేళ్లు అతి తీవ్ర ప్రభావం చూపనుందని ప్రముఖులు అంచనాలు వేయడం మొదలుపెట్టారు. ఇప్పటికే జరుగుతున్న పరిణామాలు గమనించి భవిష్యత్తును ఊహించుకున్న థామస్... ప్రస్తుతం ప్రజల అంచనాలకు తగిన సాయం చేయడం ఎలా, భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితి ఏంటి...  లేఖలో ఆవేదన చెందారు. ఈ ఆత్మహత్యలో అతనిలో పిరికితనం కొందరు చూస్తారు. కానీ అందులో ఆయన తపన, ఆవేదన, బాధ్యత చూడాలి. 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న థామస్ పదేళ్లుగా ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు.

ఇకపోతే ఆదివారం సాయంత్రానికి జర్మనీలో 58 వేల మందికి కరోనా సోకగా మరణాలు మాత్రం 455 వద్దే ఉన్నాయి.