వరుసగా రెండో రోజు వర్మకి బ్యాండ్ !

August 10, 2020

తప్పులు చేస్తే పడే శిక్షల గురించి ఆలోచించేవాడు కామన్ మాన్

తప్పులు చేస్తే పడే శిక్షను ... ఆ తప్పు వల్ల  తనకు వచ్చే ఆదాయం నుంచి మైనస్ చేసుకుని లెక్కించేవాడు ఆర్జీవీ

తాజాగా రాంగోపాల్ వర్మకు నిన్న జీహెచ్ ఎంసీ ఫైన్ పడింది. తాజాగా సీఈసీ (సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్) ఫైన్ వేసింది. ఇది చూసి అతనికి సరైన శాస్తి జరిగింది అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఆర్జీవీ దీని గురించి ఏం ఫీల్ కావడం లేదు. అనుమతి లేకుండా పోస్టర్లు వేయడం వల్ల జరిగే రచ్చ, దానికి వచ్చే పబ్లిసిటీ లెక్కలు వేసుకునే ఇలా చేసుంటాడు ఆర్జీవీ. ఇపుడు అతనికి పడిన జరిమానా... 4 వేలు + 88 వేలు. కానీ దీనివల్ల అతను మరోసారి ఫ్రీ పబ్లిసిటీ కొట్టేశాడా సినిమాకి. 

గతంలో నేను హెల్మెట్ పెట్టుకోను, త్రిబుల్ రైడింగ్ తో బైకుపై వెళ్తున్నాను పోలీసులు ఏం చేస్తున్నారు అంటూ వారిని కెలికి మరీ ఫైన్ వేయించుకున్నారు ఆర్జీవీ. అతనికి మన రాజకీయ నాయకుల గురించి ఎక్కువగా మన చట్టాల గురించి, మన రాజ్యాంగం గురించి అవగాహన ఉంది. ప్రపంచంలో గొప్ప పుస్తకాలు, సిద్ధాంతాలు తెలిసిన వాడు. కానీ తన జ్జానాన్ని ఎక్కువగా ప్రతికూలంగా వాడుతూ ఉండటమే అతనితో సమస్య. అతను తన తెలివిని సమాజానికి ఉపయోగపడేలా వాడితే అద్భుతాలు చేయగలడు. కానీ అలా చేయడు. అంతే... ఒక్కోడు ఒక్కో రకం.

Read Also

8 మొగుళ్లను మేనేజ్ చేసింది, 9వ భర్త చేతిలో...
ఈటల షాకింగ్ వ్యాఖ్యలు... దేశమంతటా ఆశ్చర్యంగా చూస్తోంది
HYD: సర్కారు బడిని తనఖా పెట్టేసుకుని లోనిచ్చేసిన బ్యాంకు