క‌రోనా వైర‌స్ వ్యాప్తి... దాని ప‌నేన‌ట‌!

August 13, 2020

చైనాలోని వుహాన్‌లో పుట్టిన కోవిడ్ 19(క‌రోనా) వైర‌స్ ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌బ్బిళాలు, అనుగు వంటి జంతువుల‌ను తిన‌డం వ‌ల్లే ఈ వైర‌స్ వ్యాప్తి చెందింద‌ని కొంద‌రి వాద‌న‌. మ‌రోవైపు, వుహాన్‌లోని ఓ ల్యాబ్‌లో గ‌బ్బిలాల‌పై జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల క్ర‌మంలో ఈ వ్యాధి మాన‌వాళికి పెనుముప్పుగా ప‌రిణ‌మించింద‌ని క‌థ‌నాలు వెలువడుతున్నాయి. శ‌త్రుదేశాల‌పై ప్ర‌యోగించేందుకు చైనా త‌యారు చేసిన బ‌యో వెప‌న్ కోవిడ్ 19(క‌రోనా) వైర‌స్ అని మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికీ ఈ మ‌హ‌మ్మారి వైర‌స్‌కు విరుగుడు క‌నుగొనేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా కోవిడ్ 19(క‌రోనా) వైర‌స్ వ్యాప్తికి దెయ్యం కార‌ణ‌మంటూ ఓ స‌రికొత్త వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.
చైనాతో పాటు పొరుగు దేశ‌మైన దక్షిణ కొరియాకు కోవిడ్ 19(క‌రోనా) వైర‌స్ వ్యాపించింది. ఆ దేశంలో ఈ వైర‌స్ బారిన ప‌డ్డ‌వారిని జైలులో ఖైదీల కంటే దారుణంగా చూస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. ఇక‌, షించెయోంగి చర్చి పెద్ద అయిన లీ మన్ హీ మాత్రం తమ దేశంలో కరోనా వ్యాప్తికి కారణం దెయ్యం అని కొత్త వాద‌న తెర‌పైకి తెచ్చారు. అంతేకాదు, దేవుడిపై విశ్వాసుల‌కు ఎంత న‌మ్మ‌క‌ముందో తెలుసుకునేందుకు పెట్టిన పరీక్ష ఇదని లీ కొత్త భాష్యం చెబుతున్నారు. తమ చర్చికి వచ్చే చాలా మందిలో కోవిడ్ 19 లక్షణాలు కనిపించడంతో తమ చ‌ర్చి యాప్‌లో ఈ దెయ్యం పోస్టు పెట్టాడు లీ. ఇక‌, తమ చర్చి ఎదుగుదలను ఆపేందుకు దెయ్యమే ఈ వైర‌స్‌ను వ్యాప్తి చేస్తుందని చెప్ప‌డం కొస‌మెరుపు. ఇప్ప‌టికే ద‌క్షిణ కొరియాలో కరోనా బాధితుల సంఖ్య 156కు పెరిగింది. ఇక‌, ఈ చ‌ర్చి పెద్ద మూఢ‌న‌మ్మ‌కంతో చెప్పిన మాట‌లు విని చికిత్స చేయించుకోకుంటే....ఆ దేశం మొత్తం క‌రోనా బారిన ప‌డ‌క త‌ప్ప‌దు.