జగన్ ఏం చేయాలో చెప్పిన పవన్

February 21, 2020

అమరావతి సమస్యను త్రిశంకు స్వర్గం...లో పెట్టారు. ప్రభుత్వంలోని మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళ పరుస్తున్నారు. ఇవన్నీ ఆపేసి ఒక అధికారిక ప్రకటన చేయండి. ప్రజలకు క్లారిటీ ఇవ్వండి. అమరావతిపై ఏదో ఒక క్లారిటీ ఇస్తే... దానిని ఏం చేయాలనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. క్లారిటీ ఇవ్వకుండా గందరగోళపరిస్తే ఏం లాభం.

ఏం మాట్లాడినా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్నారు. ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా. విచారణ చేయండి. తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? చర్యలు తీసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు అంటూ పవన్ ప్రశ్నించారు. 

జగన్ మాట మార్చాడు. యు టర్న్ తీసుకున్నాడు. ప్రతిపక్ష నేతగా అమరావతిని అంగీకరించాడు. ఈరోజు అమరావతి కాదంటున్నాడు. మూడు రాజధానులు పెడతాను అంటున్నారు. ఆరోజే అమరావతిని వ్యతిరేకించి ఉండాల్సింది. ప్రజలు ఆలోచించుకునేవారు. ఇది మోసం చేయడం కాదా? కనీసం ఇపుడు పెట్టే రాజధాని అయినా చర్చించి, అందరి ఆమోదంతో పెట్టండి. భవిష్యత్తులో అయినా ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి అని పవన్ సూచించారు. ఎవరికి అనుకూలంగా వారు నిర్ణయాలు తీసుకుని ప్రజలను మభ్యపెట్టకండి పవన్ హెచ్చరించారు.