FabiFlu : ఇక మనలో కరోనా భయం పోగొట్టనుందా?

August 11, 2020

FabiFlu: ఫాబి ఫ్లు మందుతో గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ వాణిజ్యపరంగా యాంటీవైరల్ డ్రగ్ ను ప్రారంభించిన మొదటి భారతీయ సంస్థగా అవతరించింది. ఇందులో వాడే మందు పేరు ఫావిపిరవిర్ (Favipiravir). దీని బ్రాండ్ నేమ్ ఫాబిఫ్లూ(FabiFlu).

లక్షణాలు లేని రోగులకు, మోస్తరు లక్షణాలున్న రోగుల చికిత్స కోసం ఈ మందును వాడుతున్నారు. ఇక కొద్దిరోజుల క్రితం వెలుగులోకి డెక్సా మెథసోన్ (Dexamethasone) తీవ్రమైన లక్షణాలున్న వారికి ట్రీట్ మెంట్ ఇచ్చే మందు. ఈ రెండు మందులతో ఇక కరోనా వచ్చిన జనం క్షేమంగా బయటపడొచ్చని స్పష్టమవుతోంది.

గ్లెన్ మార్క్ కంపెనీ ఇండియన్ డ్రగ్ రెగ్యులేటర్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) నుండి మార్కెటింగ్ మరియు తయారీ అనుమతి పొందింది. చాలా సైలెంటుగా పరిశోధనలు చేసిన కంపెనీ ఏకంగా ఈ రోజు ఉత్పత్తిని భారత మార్కెట్లో విడుదల చేసింది.

34 టాబ్లెట్ల ప్యాక్‌కు రూ .3,500 ( ఒక టాబ్లెట్‌కు రూ .103) ధర ఖర్చవుతుంది. మోతాదు మొదటి రోజు 200 మి.గ్రా ఎక్స్ 9 టాబ్లెట్లు వేసుకోవాలి.  14 రోజుల చికిత్సకు రోజుకు 4 టాబ్లెట్లు. భారతదేశంలోని కేసుల్లో అత్యధికం తక్కువ లక్షణాలున్న కేసులే. ఈ మందులు క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుని ఈరోజు మార్కెట్లోకి రావడం విశేషం.

ఢిల్లీకి చెందిన చెందిన బ్రింటన్ ఫార్మాస్యూటికల్స్, బెంగళూరుకు చెందిన స్ట్రైడ్స్ ఫార్మా, ముంబైకి చెందిన లాసా సూపర్‌జెనరిక్స్, హైదరాబాద్‌కు చెందిన ఆప్టిమస్ ఫార్మా కొన్ని ఇతర భారతీయ సంస్థలు కూడా తమ మందుల ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి ఇంకా ఆమోదం లభించలేదు.

గ్లెన్మార్క్ ఏపీఐ ( ACTIVE PHARMACEUTICAL INGREDIENT  ) ను స్వంతంగా అభివృద్ధి చేసింది. ఫాబిఫ్లూ కోసం సూత్రీకరణను అంతర్గత ఆర్ అండ్ డి ద్వారా అభివృద్ధి చేసింది. పరిమిత రోగులలో మూడో దశ ఫాస్ట్ ట్రాక్ ట్రయల్స్ కు బహిరంగంగా DCGI అనుమతించింది.  అందుకే ప్రస్తుత ఆమోద ప్రక్రియ కూడా అత్యవసర వినియోగ అధికారం (EUA) కింద ఉంది.

ఈ ఆవిష్కరణ వల్ల అసలు ఉపయోగం గురించి కంపెనీ ఇలా వ్యాఖ్యానించింది.  "భారతదేశంలో కేసులు మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతూ  మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్న తరుణంలో లభించిన ఈ ఆమోదం ఒక భరోసాను కల్పిస్తుంది. ఈ మందు దేశవ్యాప్తంగా రోగులకు త్వరగా అందుబాటులో ఉండేలా గ్లెన్‌మార్క్.... ప్రభుత్వం మరియు వైద్య సంఘంతో కలిసి పని చేస్తుంది " అని గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గ్లెన్ సల్దానా అన్నారు.

ఇదిలా ఉండగా...    భారతదేశంలో ఈరోజు కొత్తగా 14,516 కేసులు నమోదయ్యాయి. వీటితో కరోనా కేసులు దాదాపు 4 లక్షలకు చేరాయి. దాదాపు 13,000 మరణాలు నమోదయ్యాయి. మనదేశంలో మరణాల రేటు 3.28% గా ఉంది. 

కొసమెరుపు - ఫావిపిరవిర్ మందు ఇప్పటికే ‘‘అవిగాన్‘‘ పేరుతో ఫుజిఫిల్మ్ తోయామా కెమికల్ కంపెనీ జపాన్ లో విక్రయిస్తున్నారు. ఇన్ఫ్లుఎంజా చికిత్స కోసం 2014 నుంచి జపాన్లో ఆమోదించబడింది. దీనిని గ్లెన్ మార్క్ కోవిడ్ పనికొచ్చే మోతాదు ఫార్ములాను పరిశోధించి రూపొందించింది.

 

FabiFlu : కరోనా చికిత్సకు మరో మందుకు ఇండియాలో అనుమతి