ఏపీలో ఏం జరిగిందో తెలిస్తే మీరు షాకవుతారు

June 02, 2020

ఇది అనూహ్యమైన రాజకోట రహస్యం. ఆ రాజకోటలో మహామంత్రికే తెలియకుండా మహామంత్రి పేరుమీదుగా ఆదేశాలు. రాజు జగన్... మహామంత్రి ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ఇటీవల అమరావతిలో న్యాయ కార్యాలయాల తరలింపునకు ఉద్దేశించి విడుదల చేసిన 13వ నెంబరు జీవో అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ప్రధాన కార్యదర్శి పేరు మీదుగా విడుదలైన ఈ జీవో ప్రధాన కార్యదర్శి సంతకం లేకుండా, అసలు ఆమెకు తెలియకుండా విడుదలైంది. దీనిని కోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.

ఈ విషయంపై ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా చీవాట్లు పెట్టిందట. పాలనకు పద్ధతి లేకుండా, రాజ్యాంగ విరుద్ధంగా జీవో జారీ చేయడం ఏంటి? శాసన, కార్యనిర్వహక వ్యవస్థలు వేటికవే స్వతంత్రమైనవి. ఒకదాని కంటే ఇంకొకటి తక్కువ కాదు. శాసన వ్యవస్థకు ముఖ్యమంత్రి నాయకుడు. కార్యనిర్వహక వ్యవస్థకు ప్రధాన కార్యదర్శి నాయకుడు. కానీ ప్రధాన కార్యదర్శి పేరుమీద రాయబడిన జీవో ఆ వ్యక్తికి తెలియకుండా దొంగతనంగా విడుదల చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. అసలు ఇలాంటి ఆలోచనే ప్రమాదకరమైన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.