బోటు బయటకొచ్చింది... ధర్మాడి సత్యం ఏమన్నాడంటే..

April 02, 2020

విహార యాత్రకు బయలుదేరి సెప్టెంబరు 17న గోదావరిలో మునిగిపోయిన రాయలవశిష్ట బోటును 38 రోజుల ర్వాత ఇన్నాళ్లకు బయటకు తీశారు. కచ్చులూరు వద్ద మునిగిపోయిన ఈ బోటు చాలా లోతులో ఉందని అందరూ అనుకుంటుండడగా... దానిని ఈరోజు వెలికితీసిన ధర్మాడిసత్యం అది కేవలం 26 అడుగుల లోతున ఉన్నట్టు తెలిపారు. అయినా అతి కష్టం మీద 7 రోజుల పాటు శ్రమించి బయటకు తీశామని చెప్పారు. 

25 మంది ఈ ఆపరేషనులో పాల్గొనగా... తన పట్టుదల వల్ల బోటును బయటకు తీశామని సత్యం పేర్కొన్నారు. అత్యంత విషాదకరమైన విషయం ఏంటంటే... వెలికితీసిన బోటులో 5 మృతదేహాలున్నాయి. కానీ అవి ఎవరివో తెలియని దయనీయ పరిస్థితి. నెలన్నరకు పైగా నీటిలో ఉండటం మూలంగా పూర్తిగా పాడైపోయి ఉన్నాయి. మృతదేహాలు తమ బంధువులేమో అని ఎంతో ఆశగా ఎదురుచూసిన వారి బంధువులు ఏది తమ వారిదో తెలియక రోదించిన తీరు అందరినీ కలచివేసింది.