ఇపుడు వారి కట్టడాన్ని కూలుస్తారా జగన్ ?

February 24, 2020

ఆంధ్రులు ఆరంభ శూరులు అనే ముద్ర నిజమేనని, అదింకా మారలేదని.. నిరూపించిన మరో వ్యక్తి సీఎం జగన్. మొదటి మీటింగ్ పెట్టిన బిల్డింగును 8 కోట్ల ప్రజల డబ్బు ఖర్చు పెట్టిన కూల్చిన విషయాన్ని కూడా పట్టించుకోకుండా కూల్చివేయించారు. పోనీలే... 8 కోట్ల జనం డబ్బు పోయినా.. రాష్ట్రంలో ఆక్రమణలు అన్నీ తొలగిస్తే అందరికీ మంచిదే కదా అని జనం సర్దుకున్నారు. కానీ... ఆ తర్వాత కొంతకాలం చంద్రబాబు ఇంటిమీద జగన్ సర్కారు హడావుడి చేసింది. చుట్టుపక్కల ఉన్నవారికి నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు అందుకున్న వారిలో బీజేపీ నేత గోకరాజు కుటుంబం ఒకటి. వారి గెస్ట్ హౌస్ ఒకటి అక్కడుంది. 

కట్ చేస్తే... రాష్ట్రంలో ప్రజా వేదిక తర్వాత ఓ రెండు మూడు టీడీపీ వాళ్లవి మాత్రమే కూల్చారు. మిగతావన్నీ అలాగే ఉన్నాయి. ఆర్నెల్లు గడిచింది. అక్రమ కట్టడాల కూల్చివేత ఆగిపోయింది. జగన్ నిర్ణయం ఆరంభ శూరత్వమే అని తేలింది. ఇక పోతే అక్రమ కట్టడాల్లో ఒకటి అయిన గోకరాజు గెస్ట్ హౌస్ ఇక ముందు కూల్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే.. తాజాగా గోకరాజు కుటుంబం వైసీపీలో చేరింది. ఎందుకు పార్టీ మారారు అని మీడియా అడుగుతుందేమో అని వారే ముందే ఒక చక్కటి ప్లాన్ వేసుకుని దానిని వల్లె వేశారు. 

జగన్ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. మాకు నచ్చాయి. ఇదే విషయం చెబుదామని సీఎం జగన్ ను కలిశాం. ఆయన ఆలోచనలు మాతో కలిశాయి. దాంతో వైసీపీ కండువా కప్పు కున్నాం అని చెప్పుకొచ్చారు. వహ్వా...అంటే ఇక కృష్ణా నది ఒడ్డున ఉన్న గోకరాజు గౌస్ట్ హౌస్ కి ఢోకా లేదన్నమాట.