హెచ్1బీ ఎన్నారైలకు ఓ హోప్ దొరికింది

August 07, 2020

ట్రంప్ వచ్చింది మొదలు... ఎపుడు ఏం బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అని ఎన్నారైలు... గందరగోళంలో పడిపోయాయి. ఇప్పటికే ట్రంప్ భారతీయులకు చాలా షాక్ లు ఇచ్చారు. హెచ్4 వీసాలను రద్దు చేయాలన్న అమెరికా నిర్ణయం భారతీయులు, ఇతర దేశీయులకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో ఒక హోప్ కనిపించేలా ఉంది ఎన్నారైలకు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి రక్షణగా కాలిఫోర్నియాకు చెందిన సెనెటర్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. దీంతో హెచ్ 4 వీసాదారులకు కాస్త ఊరట లభించింది. అమెరికా చట్టసభ ప్రతినిధులు అన్నా జి ఎషో, జో లాఫ్‌గ్రెన్‌లు వీసాదారుల రక్షణ కోసం ’’హెచ్4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్‘‘ బిల్లును ప్రవేశపెట్టారు.
హెచ్4 వీసాలు అంటే... హెచ్ 1బీ వీసాదారుల లైఫ్ పార్టనర్ కు ఇచ్చేవి. ఈ వీసా వారికి అమెరికాలో ఉద్యోగ అర్హత కల్పిస్తుంది. వీటిని ప్రవేశపెట్టింది ఒబామా. 2015లో అప్పటి ఒబామా సర్కారు అమెరికాలో సాంకేతిక నిపుణుల కొరత తీర్చడానికి హెచ్ 4 వీసాలు ప్రవేశపెట్టింది. దీంతో ఎంతో మంది ఎన్నారై జీవితాల్లో వెలుగు కనిపించింది. 2017లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒబామా సర్కారు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని అందరికీ షాకిచ్చారు. చివరకు గతేడాది హెచ్ 4 వీసా రద్దు ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. అది పలు దశలు దాటింది. త్వరలో అది అమలు కానున్న నేపథ్యంలో సెనెటర్లు వారందరికీ భరోసా ఇస్తూ చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టారు. మరి ట్రంప్ ది పైచేయి అవుతుందా? లేదా సెనెటర్ల రూపంలో ఎన్నారైలకు భవిష్యత్తు దొరుకుతుందా అనేది వేచిచూడాలి.