ట్రంప్ పెద్ద మ‌న‌సు...ఇండియ‌న్ల‌కు భారీ గుడ్ న్యూస్

August 14, 2020

అగ్ర‌రాజ్యం అమెరికాలో టెన్ష‌న్‌తో ఉన్న ఇండియ‌న్ల‌కు భారీ ఊర‌ట‌. షాకుల ప‌రంప‌ర‌కు మారుపేర‌యిన అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ తీపిక‌బురు వినిపించారు. ఆయ‌న వినిపించిన గుడ్ న్యూస్‌తో అధికంగా ల‌బ్ధి పొందేది ఇండియ‌న్లే. అమెరికాలోని మొత్తం రెండున్నర లక్షల హెచ్ 1 బీ వీసా హోల్డర్డ్స్ లో 2 లక్షల మంది జూన్ చివరి నాటికి లీగల్ స్టేటస్ కోల్పోనుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. ఇమ్మిగ్రేషన్ ను ఆరు నెలల పాటు అమెరికా నిలిపివేయటంతో స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనని అంతా భయపడ్డారు. అయితే, వీరందరికీ రెండు నెలల పాటు గ్రేస్ పీరియడ్ ఇస్తూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా హెచ్ 1 బీ వీసాలు టెక్నాలజీ రంగంలో పనిచేసే వారికే ఎక్కువగా ఇస్తారు. దీంతో అమెరికాలోని ప్రముఖ కంపెనీలు హెచ్ 1 బీ వీసా ద్వారా విదేశాల నుంచి ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులే ఇందులో ఎక్కువగా ఉంటారు. ఇతర రంగాల్లోఉద్యోగం చేసేందుకు వెళ్లే వారైనా సరే హెచ్ 1 బీ వీసా తో పనిచేస్తూ ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ లేదా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలా హెచ్ 1 బీ వీసా ద్వారా అమెరికా వెళ్లే వారిలో ఇండియన్సే 70 శాతం ఉంటారు. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పుడు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారికి వీసా రెన్యువల్ గానీ కొత్త ఉద్యోగం గానీ దొరికే పరిస్థితి లేదు. దీంతో హెచ్ 1 బీ వీసా తో అమెరికాలో ఉన్న ఇండియన్స్ లో ఆందోళన మొదలైంది.
ఈ స‌మ‌యంలోనే అమెరికా స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దీంతో, కరోనా స‌మ‌యంలో జాబ్ కోల్పోయిన హెచ్1బీ వీసాదారులు కొత్త జాబ్ వెతుక్కోవటానికి మరో రెండు నెలల అదనంగా సమయం దొరికింది. హెచ్-1బీ వీసాదారులు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లను మరో 60 రోజుల్లోగా ఎప్పుడైనా సమర్పించవచ్చని ప్రభుత్వం సూచించింది.