జగన్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య

February 22, 2020

ఈరోజు సంక్రాంతి పండగ. కానీ మునుపటి సంక్రాంతుల ఉత్సాహం ఇపుడు లేదు.  ఏపీ మొత్తం రాజధాని మార్పు అశాంతి ప్రజలను కలచివేస్తోంది. తమ రాజధాని ఏదో, దాని భవిష్యత్తు ఏంటో తెలియక అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పండగ రూపంలో ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే, ఏపీలో వైసీపీ కేడర్ మద్దతు మాత్రమే ఇపుడు జగన్ కి ఉంది. 151 సీట్లు తెచ్చుకున్న జగన్ కి ఇపుడు ఆ ప్రభ ఎక్కడా కనిపించడం లేదు. ఇదిలా ఉండగా... అవగాహన రాహిత్యంతో రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న జగన్ పై తెలుగుదేశం నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారీ తూర్పారబడుతున్నారు. 

తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఒక వైసీపీ వీరాభిమాని నవరత్నాలు ముగ్గు వేసి అందులో జగన్ పథకాలను వివరించారు. మధ్యలో గొబ్బెమ్మ పెట్టే స్థానంలో జగన్ ఛాయాచిత్రం పెట్టారు. ఈ ఫొటోను షేర్ చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ‘‘గొబ్బెమ్మను పెట్టాల్సిన చోట దద్దమ్మను పెట్టారు’’ అంటూ విమర్శలు చేశారు. ఆయన ట్విట్టరు అక్కౌంట్లో తాజాగా చేసిన ఈ పోస్టుకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.