​మోడీకి కేబినెట్లోకి వైసీపీ... ఈ గాసి​ప్ లో నిజమెంత?

May 31, 2020

అంతర్జాతీయ మీడియాకు - చంద్రబాబుకు అక్రమ సంబంధం అంటగట్టిన ఘనత జగన్ సైన్యానికి దక్కుతుంది. ఎప్పటికపుడు భారీ బడ్జెట్ సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచినట్టు... జగన్ బలం మీద కథలు అల్లుతూ ఉంటుంది జగన్ మీడియా, జగన్ టీం. తాజాగా ఒక గాసిప్ బాగా వైరల్ అవుతోంది. మోడీకి అంతా వ్యతిరేకత పెరిగింది. ఈ నేపథ్యంలో అత్యధిక సీట్లున్న జగన్ విలువ తెలిసివచ్చింది. అందుకే జగన్ కు రెడ్ కార్పెట్ పరిచి కేబినెట్ పదవులు ఇస్తారు. వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగమవుతుంది అన్నది ఆ గాసిప్ సారాంశం. ఈ గాసిప్ సృష్టిలో కనీసం కామన్ సెన్స్ కూడా వాడకపోవడం చూస్తే నవ్వు రాక తప్పదు. 

బీజేపీ ఎంత చెడినా... ఆర్ ఎస్ ఎస్ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయదు. విలువల్లో అటు ఇటు కావచ్చేమో గాని తన ఉనికిని కోల్పోయే పనులకు బీజేపీ పూనుకోదు. హిందుత్వం ఆధారంగా దేశం మొత్తంపై రాజకీయాధికారం చెలాయించులనుకుంటున్న బీజేపీ ఆ బేస్ పైనే తను అడుగులు వేసుకుంటూ పోతుంది. జగన్ హిందు కార్యక్రమాల్లో పాల్గొన్నా కూడా అది కేవలం పొలిటికల్ నెస్సెసిటీతోనే పాల్గొంటారు. కానీ పార్టీ మూలాలు అన్నీ క్రిస్టియానిటీలోనే ఉన్నాయి. ఇప్పటికీ జగన్ కుటుంబం క్రమం తప్పకుండా ఇజ్రాయిల్ వెళ్తూ ఉంటుంది. జగన్ పార్టీ ఆత్మ బైబిల్ చుట్టూ తిరుగుతుంటుంది. అలాంటి పార్టీతో బీజేపీ పొత్తుపెట్టుకోవడానికి బీజేపీ మూల సిద్ధాంతాలు ఒప్పుకోవు. ఆర్ఎస్ఎస్ నుంచి అనుమతి దక్కదు. ఆర్ఎస్ఎస్ కాదన్న పని చేసే పరిస్థితిలో బీజేపీ లేదు. కాబట్టి జగన్ నుంచి బయటి మద్దతు తీసుకోవడం వరకే మోడీ- జగన్ బంధం పరిమితం అవుతుంది. అంతేగాని అధికారికంగా ఒక క్రిస్టియన్ పార్టీతో అలయన్స్ ఏర్పాటుచేసే సమస్యే ఉండదు. 

ఇదిలా ఉంటే... అసలు మరో సారి జాతీయ ఎన్నికలు జరిగేదాకా మోడీ మెజారిటీ మారదు. అలాంటపుడు అక్కడక్కడా పార్టీ ప్రాంతీయ ఎన్నికల్లో ఓడిపోయినా దేశంలో అధికారం బీజేపీదే. కాబట్టి... అంత వేగంగా జగన్ ని అక్కున చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదు. మరో కీలక విషయం ఏంటంటే... నార్త్ ఇండియా నాడి వేరు. వారు ప్రాంతీయ ఎన్నికల్లో బీజేపీని పట్టించుకోకపోయినా... జాతీయ ఎన్నికల్లో హిందుత్వానికే ప్రాధాన్యం ఇస్తారు. మధ్య ప్రదేశ్ వంటి చోట్ల అతి తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో కాంగ్రెస్, లోక్ సభలో బీజేపీ గెలవడానికి కారణం ఇదే. కాబట్టి... జగన్ బీజేపీ ప్రభుత్వంలో చేరడం అనేది గాసిప్ గానే సమాధి అవుతుంది. రియాలిటీలో అది ఎన్నటికీ జరగదు. అయినా... దేశంలో ఉండే సెక్షన్లు అన్నింటి కిందా ఆర్థిక నేరాలు  నమోదై జగన్ జుట్టంతా కేంద్రం చేతుల్లో ఉండగా... ప్రత్యేకంగా జగన్ తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మోడీకి లేదు అన్న విషయం గుర్తుంచుకోవాలి.