గవర్నరుకు చంద్రబాబు మూడు కోరికలు

August 07, 2020

గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‍కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 

రాష్ట్రంలో వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయని లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు.

రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న మీరు ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ పరిరక్షణ కోసం పాటుపడాలని లేఖలో చంద్రబాబు గవర్నర్ కు విజ్ఞప్తి  చేశారు.

చంద్రబాబు మాటల్లో లేఖ సారాంశం చెప్పాలంటే... ‘‘రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన అరెస్టులు, అక్రమ నిర్బంధాలు పెరిగిపోయాయి. 

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. 
మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను అధికార పార్టీ హరించివేస్తోంది. 

సోషల్ మీడియా వేదికగా పోలీసులు అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు. బాలినేనిపై తమిళనాడు అంతటా మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి . 

నగదు రవాణా చేస్తున్న వారిని వదిలిపెట్టారు. కానీ ఆ విషయం గురించి పోస్టు పెట్టిన సందీప్, చంద్రశేఖర్‍ను అరెస్టు చేశారు. 

మూడు స్టేషన్లు తిప్పుతూ దారుణంగా కొట్టి భౌతికంగా హింసించారు. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు లేవు. మీరు పునరుద్ధరించి ప్రజలను పాలకుల నుంచి రక్షించండి‘‘ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలో కోరారు.

ఇదిలా ఉండగా... రాష్ట్రంలో కరోనా విశృంఖలంగా పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో రోగులకు గౌరవం లేకుండా అంబులెన్సుల్లో కుక్కి తీసుకెళ్తున్నారు.

ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి అంటూ చంద్రబాబు ఇటీవలే ట్వీట్ చేశారు. వైసీపీ సర్కారును చంద్రబాబు, నారా లోకేష్ చెరో వైపు ట్విట్టరుతో ఆడుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.