రాజకీయ వైచిత్రి ... కంపరం పుట్టిస్తోందే

July 12, 2020

తాటిని దన్నేవాడి తలదన్నే వాడు ఉంటాడు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా... బీజేపీకి సంపూర్ణంగా మెజారిటీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మధ్య ఎక్కడా రాలేదు. అయినా ఆ పార్టీయే అధికారంలోకి వస్తుంది. మిగతా పార్టీలన్నీ ఏదో విధంగా తలొగ్గడమో, బీజేపీ అధికార బలానికి తట్టుకోకపోవడమో జరిగింది. కానీ.. అందరినీ బీజేపీ వంగోబెడితే... బీజేపీని శివసేన వంగోబెట్టింది. ఈ వైచిత్రికి మహారాష్ట్ర కేంద్ర బిందువు అయ్యింది.

అదేంటి... కర్ణాటకలో బీజేపీకే కొన్నట్టే... తెలంగాణలో కేసీఆర్ ఎమ్మెల్యేలను అడ్డంగా కొనేసినట్టే.. మహారాష్ట్రలో బీజేపీ కొనలేదా అన్న అనుమానం మీకు వచ్చింది కదా. మిగతా రాష్ట్రాల సంగతి వేరు మహారాష్ట్ర సంగతి వేరు. 

శివసేన... బీజేపీకి మించిన హిందూ పార్టీ. ఆ పార్టీని నాశనం చేయాలని చూస్తే... RSS కి ఇష్టముండదు. అంతేగాకుండా మిగతా ప్రాంతీయ పార్టీల్లాంటి సాధారణ రాజకీయ పార్టీ కాదు శివసేన. చాలా స్ట్రాంగ్ లోకల్ పార్టీ. ప్రాంతీయత, హిందుత్వం కలబోసిన ఆ పార్టీ నుంచి ఇతర పార్టీల వైపు ఎమ్మెల్యేలు ఆకర్షితులు కావడం జరిగే పని కాదు. అందుకే గవర్నరు పిలిచినా... ప్రభుత్వ ఏర్పాటు మా వల్ల కాదంటూ బీజేపీ చేతులు ఎత్తేసింది. అక్కడ ఉన్నవి రెండే కూటములు. ఒకటి బీజేపీ - శివసేన కూటమి. రెండోది కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి. ఇపుడు బీజేపీ అతిపెద్ద పార్టీ అయినా... ఫలితం లేదు. శివసేన కలిస్తే మాత్రమే ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుంది. లేదంటే మళ్లీ ఎన్నికలే. ఈ నేపథ్యంలో బీజేపీ శివసేనను ఏమీ చేయలేకపోతోంది. మరోవైపు శివసేన బీజేపీ కంటే చాలా తక్కువ సీట్లు వచ్చినా కాంగ్రెస్, ఎన్సీపీ వారు మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉంది. తమాషా ఏంటంటే... వారితో ఎన్సీపీ కలిస్తే జనాలు ఒప్పుకుంటారు గాని... బీజేపీ కలిస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. దీంతో ఈ పార్టీలు జనాల్లో, నాయకుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి. 

చివరకు గవర్నరు తాజాగా శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. తనకు చేతకాకపోయినా ఆ పార్టీ సిద్ధమైంది. వాస్తవానికి ఇది ఎన్నో రోజులు నిలిచి ఉండే మద్దతు కాదు. కానీ బీజేపీ మీద గ్రడ్జ్ ని శివసేన తీర్చుకుంటుంది. బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి పదవి అడగడంపై జనాలు అంత సంతృప్తిగా ఏం లేరు. మరి ఇది ఎక్కడిదాకా దారితీస్తుందో చూడాలి. 

కొసమెరుపు ఏంటంటే... బీజేపీ ఇతర అన్ని రాష్ట్రాల్లో ఆడిందే ఆట అయ్యింది గానీ మహారాష్ట్రలో కాలేదు.