మోడీ కొట్టిన దెబ్బ మామూలుగా లేదు !​

August 09, 2020

మోడీని... కరోనాకు ముందు, కరోనా తర్వాత అని చూడాలి ఇక నుంచి మనం. కరోనా తర్వాత మోడీలో చాలా మార్పు కనిపించింది. అంతకుముందు అన్నీ సర్ ప్రైజ్ నిర్ణయాలే తీసుకున్న మోడీ... కరోనా విషయంలో రిస్క్ తీసుకోవడం లేదు. ఎవరు మంచి చెప్పినా వింటున్నారు. ప్రపంచంలో నెల రోజులుగా ఒక వార్త బాగా ప్రచారంలో ఉంది. చైనా ఈ వైరస్ ను ప్రపంచంలోకి వదిలి ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలను నాశనం చేసి... వ్యూహాత్మకంగా తాను ఆయా దేశాల్లో బలహీనపడిన మంచి కంపెనీలను టేకోవర్ చేయాలని ప్రయత్నిస్తోందన్నద ఆ వార్త సారాంశం. ఇది ప్రపంచంలో అందరూ నమ్ముతున్నారు. ఈరోజు ఏకంగా ట్రంప్ ... చైనాలోకి ఆ వైరస్ ఎలా వచ్చిందో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. గబ్బిలం కాదు, ఏమీ కాదు... ఇదంతా చైనీస్ వైరస్ అంటూ ట్రంప్ దుమ్మెత్తి పోశారు. కీడెంచి మేలెంచుదాం అన్నట్లు భారత్ కూడా దీనిని విశ్వసించింది.

అందుకే భారత ఆర్థిక వ్యవస్థలోకి ఇతర ప్రమాదకరమైన దేశాలు వ్యూహాత్మకంగా చొరబడకుండా చట్టంలో కీలక మార్పులు చేసింది. ఇలాంటి మార్పులు ఇంత వేగంగా చేయడం భారత్ లో ఇదే మొదటి సారి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయం ఇది.  తాజా మార్పుల ప్రకారం.... భారత సరిహద్దు దేశాలు ఇక భారతదేశంలో నేరుగా గాని, భారత కంపెనీల్లో గాని పెట్టుబడులు పెట్టలేవు. ఒకవేళ పెట్టాలనుకుంటే ముందుగా భారత ప్రభుత్వం ఆమోదం తర్వాతే ఆ నిర్ణయం జరుగుతుంది అని చట్టాన్ని సవరించింది.  ఈ వివరాలను డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (DPITT) వెల్లడించింది. అంటే అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, చైనా, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక దేశాలు ఇపుడు మనదేశానికి చెందిన ఈ కంపెనీని కొనే అవకాశం లేదు. పెట్టుబడి పెట్టే అవవకాశం కూడా లేదు. చైనా వ్యూహాలపై దీనిని చావు దెబ్బ అనాలి.

మోడీ తీసుకున్న ఈ నిర్ణయం క్రెడిట్ ను రాహుల్ తీసేసుకున్నాడు. ఆయనకేం సంబంధం అంటారా? రెండు వారాల క్రితమే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇదే అంశంపై మోడీని హెచ్చరించారు. మన కంపెనీలను విదేశీ కంపెనీలు ఇపుడు టేకోవర్ చేస్తే వారి గుత్తాధిపత్యం పెరిగిపోతుందని రాహుల్ హెచ్చరించారు. నా మాట వినే మోడీ ఇలా చేశాడు అని... మాట విన్నందుకు థాంక్స్ అని రాహుల్ ట్వీట్ చేశాడు. అంటే దీనర్థం... నేను చెబితే మోడీ చేశాడు అని రాహుల్ ఫిక్సయ్యాడు. పోనీలే క్రెడిట్ ఎవరికి వచ్చినా.. దేశానికి మేలు జరిగితే చాలు కదా.