చంద్రబాబు ట్వీటేస్తే పనులైపోతున్నాయి

July 04, 2020

ప్రతిపక్షం బాధ్యతాయుతంగా ఉండాలి. అధికార పక్షాన్ని డ్యామేజ్ చేయడం ద్వారా, ట్రాప్ చేయడం ద్వారా ప్రతిపక్షానికే లాభం. కానీ చంద్రబాబు బాధ్యతాయుత రూట్లో వెళ్తున్నారు. రాష్ట్రంలో ప్రధాన సమస్యలకు వైసీపీని బ్లేమ్ చేసి వదిలేయకుండా... తక్షణ సలహాలు ఇస్తూ, బాధ్యతను గుర్తుచేస్తూ స్పందిస్తున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వాన్ని నిద్రలేపి ప్రజల కష్టం తీరడానికి కృషిచేస్తున్నారు చంద్రబాబు.
తాజాగా ఆశా వర్కర్లు కొన్ని వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం కేవలం 1500 రూపాయలు పెంచి గ్రేడ్లు వారీగా జీతాలు ఇస్తామని చెప్పింది. అంటే చాలా కొద్ది మందికి మాత్రమే పదివేలు వస్తాయి. మిగతా వారికి గత ప్రభుత్వంలో కంటే తక్కువ వస్తాయి. దీనికి కారణం గ్రేడింగ్ ప్రకారం శాలరీ ఇవ్వాలని గవర్నమెంటు నిర్ణయించడం. గ్రేడింగ్ వల్ల చాలామందికి అన్యాయం జరుగుతంది. చిరుద్యోగులను హింసించొద్దు. గ్రేడింగ్ లు తీసేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే సమయంలో వారికి పెంచిన శాలరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు ప్రభుత్వం దిగివచ్చి వారికి గ్రేడింగ్ లు ఎత్తేయాలని డిసైడ్ చేసింది. అయితే, ఇందులో చంద్రబాబుకు ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని విపక్షాన్ని బ్లేమ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. మేము గ్రేడింగ్, పాయింట్ల పద్ధతి తీసుకురావడం లేదు. ఆందోలన చెందొద్దు అని చెప్పింది. విపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు.
మంత్రి ఆళ్లనాని చెప్పినట్లు విపక్షం చేసిన ప్రచారం కాదు అది. ఆశా వర్కర్లు గ్రేడింగ్ తొలగించాలని అన్ని ధర్నా కేంద్రాల్లోను బ్యానర్లు పెట్టారు. మరి మంత్రి గారి దృష్టికి అది రాలేదేమో. అందుకే అది కేవలం చంద్రబాబు చేసిన వ్యాఖ్య అనుకుని పొరబడ్డారు.
మొన్న కూడా ప్రభుత్వ లబ్ధిదారుల సమస్యను చంద్రబాబు ఎత్తి చూపడంతో ప్రభుత్వం దిగొచ్చింది. ఈకేవైసీలపై జనం ఆందోళనతో బారులు తీరి ఈకేవైసీ చేసుకోవడం గమనించిన చంద్రబాబు దానిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జనంతో ఆడుకోవద్దు. వారిని ఆందోళనకు గురిచేయొద్దు. టెక్నాలజీని వాడుకోండి అని సూచించారు. ప్రభుత్వ పథకాలు ఈకేవైసీ చేయించుకున్న వారికే వస్తాయని వదంతని ప్రభుత్వం పట్టించుకోకుండా నిద్రపోతుండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు తీవ్రంగా స్పందించడంతో నిద్రలేచిన ప్రభుత్వం... రెండు మూడుసార్లు ప్రకటనలు చేసి ఈకేవైసీ అర్జెంటేం కాదు, ఆందోళన చెందకండి అని చెప్పింది.ఏదేమైనా చంద్రబాబు తన ట్వీట్లతో ప్రభుత్వంతో పనులు చేయించడం విశేషం. విపక్షం విమర్శలు అధికార పక్షం వెన్నులో వణుకు తెప్పిస్తున్నాయి.