గ్రామ వలంటీర్ అరాచకం - బాలికపై రేప్

August 07, 2020

ఏపీలో వలంటీర్ల విజయాల గురించి పాజిటివ్ వార్తలకంటే నెగెటివ్ వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతిచోటా ఏదో ఇక దారుణం. తాజాగా గత నెలరోజుల్లో జరిగిన సంఘటనలు చూస్తే ... వలంటీర్లు పార్టీ చేసుకుంటూ రెండు జిల్లాల్లో పంచాయతీ కార్యాలయాలను బార్లను చేశారు. రెండ్రోజుల క్రితం పింఛను డబ్బులతో పేకాట అలవాటున్న ఒక వలంటీర్ పారిపోయారు. తాజాగా మరో చిత్తూరు జిల్లాలో మరో ఘోరం జరిగింది.

బాలికపై ఒక వలంటీర్ అత్యాచారానికి పాల్పడ్డారు.  జులై 1న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్నానం చేసి బాలిక ఇంట్లోకి వెళ్లడం చూసిన వలంటీర్ కామంతో కళ్లు మూసుకుపోయి బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పుంగనూరు మండలంలోని గూడూరుపల్లెలో ఈ ఘోరం జరిగింది.

బాలిక తల్లిదండ్రులు వివరాల ప్రకారం... జూలై 1న గ్రామ వాలంటీర్ నరేష్ గ్రామంలో పింఛన్లు పంపిణీ చేయడానికి ఇళ్లకు తిరుగుతున్నాడు. ఆ క్రమంలోనే ఓ వృద్ధురాలి పింఛను పంచడానికి ఓ ఇంటికి వెళ్లాడు. ఆ ఇంట్లో 9వ తరగతి విద్యార్థిని మాత్రమే అక్కడుంది. మిగతా వాళ్లు ఎక్కడికో బయటకు వెళ్లారు. ఆ సమయంలో  అపుడే స్నానం చేసిన బాలిక బట్టలు మార్చుకుంటుండగా గమనించిన గ్రామ వాలంటీర్ ఆమెపై బలత్కారం చేశాడు.

తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక జరిగిన ఘోరం చెప్పి ఆ బాలిక కన్నీరుపెట్టుుకంది. కేసు పెట్టకుండా ఉండేందుకు స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పంచాయితీ చేయబోయారు. అక్కడ న్యాయం జరగకపోవడం, నిందితునికి శిక్ష వేయకపోవడంతో తల్లిదండ్రులు పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దారుణం ఏంటంటే...  పోలీసులు కేసును పట్టించుకోవడం బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆ భయం నుంచి ఇప్పటికీ బాలిక తేరుకోలేదు. దీంతో వేరే ఊర్లోని బంధువుల ఇంటికి తరలించారు. వలంటీర్లే అఘాయిత్యాలకు పాల్పడితే.. ఆడపిల్లలకు రక్షణ ఎక్కడ ఉంటుందని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.  కూతురికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తామని వాడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.