జగనన్న గ్రామ వలంటీరా మజాకా?

May 27, 2020

గ్రామ స్వరాజ్యం అంటూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గ్రామ వలంటీర్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. సదుద్దేశంతో ఏర్పాటుచేయాలనుకున్నపుడు కాస్త క్రమశిక్షణ కలిగిన, సాఫ్ట్ నేచర్డ్ క్యాండిడేట్స్ ను ఆచితూచి ఎంపిక చేయాలి. ఎందుకంటే ఈ విధులు నిర్వర్తించే వారికి చాలా ఓపిక కావాలి. నలుగురితో చక్కగా మాట్లాడే నేర్పు ఉండాలి. కానీ ఆంధ్రా లో దీనికి విరుద్ధంగా జరిగింది. స్వయంగా వైసీపీ పార్టీలో నెం.2 నాయకుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ పార్టీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి గ్రామ వలంటీర్ పోస్టులన్నీ వైకాపా వాళ్లకే ఇచ్చినట్టు బహిరంగ వేదిక మీద చెప్పారు. ఆయన మాటలకు బలం చేకూర్చేలా ఆ పేపరు కూడా లీకైంది. ఇవి చాలవన్నట్లు గ్రామ వలంటీర్లు గ్రామాల్లో అనేక నేరాలకు పాల్పడుతున్నారు.

కొంతకాలం క్రితం ఓ మహిళపై వలంటీర్ అత్యాచార యత్నం చేసిన విషయం తెలిసిందే. తాజాగా పింఛను ప్రకాశం జిల్లాలో మరో ఘోరం జరిగింది. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పాపాయిపాలెం గ్రామంలో పింఛన్ అడిగిన పాపానికి ఓ లబ్దిదారుపై గ్రామవాలంటీర్ దాడి చేశాడు. పింఛన్ అప్లికేషన్ల వ్యవహారంలో ఆలస్యానికి గాని గ్రామవాలంటీర్ పై పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ వాలంటీర్.. శ్రీనివాసరావుపై అనే గ్రామస్థుడిపై కత్తితో దాడికి దిగాడు. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్నవారు బాధ్యతాయుతమైన వృత్తి అప్పగిస్తే ఎలా. ఆయనకు ఏమైనా అయితే... రేపు శ్రీనివాసరావు కుటుంబం పరిస్థితి ఏంటి?

ఈ దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వేటపాలెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చాలా రక్తం పోయింది. ఈ దాడిని రాష్ట్ర ప్రజలందరూ ఖండించారు. అసలు కార్యదర్శికి ఫిర్యాదు చేస్తే అతనిపై కత్తితో దాడిచేశాడంటే... ఇక జగన్ పెట్టిన అవినీతి వ్యతిరేక కాల్ సెంటర్ కి ఫోన్ చేస్తే కుటుంబం మొత్తాన్ని చంపేవాడా? అని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.