​చంద్రయాన్ 2 లో ’బాహుబలికి‘ ప్రత్యేక గౌరవం

August 13, 2020

​అంతర్జాతీయంగా భారత్ కు చంద్రయాన్ 1 ఎంతో ప్రతిష్టను సంపాదించిపెట్టింది. దీంతో చంద్రయాన్ 2 ప్రయోగాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇస్రో. బహుళ ప్రయోజనకారి అయిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో మన సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు స్పస్టంగా అర్థమైంది. టెక్నాలజీ రంగంలో భారత్ వేసిన ఈ అతిపెద్ద ముందడుగు మన దేశ ముఖచిత్రాన్ని ఎంతగానో మార్చనుంది. ఇదిలా ఉండగా... భారతదేశం పండగలా జరుపుకుంటున్న ఈ ప్రయోగంలో ’బాహుబలి‘కి ప్రత్యేక గౌరవం దక్కింది.
చంద్రయాన్ 2 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి తీసుకెళ్లడానికి ఉపయోగించిన జీఎస్ ఎల్ వీ మార్క్ 3 - ఎం1 వాహన నౌకకు ’బాహుబలి‘ అని ఇస్రో నామకరణం చేసింది. బాహుబలి అనే పేరు భారతీయ ఇతిహాసాల్లో ఉన్నా కూడా రాజమౌళి సృష్టించిన కళాఖండంతో అది ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోయింది. ప్రపంచ సినిమా చరిత్ర రికార్డుల్లో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకున్న సినిమా బాహుబలి. సూపర్ పాజిటివిటీకి ప్రత్యామ్నాయమే బాహుబలి. అందుకే ఆ పేరు ప్రతి చోటా వాడేస్తున్నారు. బాహుబలి గురించి మాట్లాడని భారతీయుడే లేడు. అంతెందుకు ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేశాయి. ఇలా భారతీయ సినిమా రికార్డుల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఈ సినిమా పేరును ఒక ప్రముఖ ప్రయోగంలో వాహక నౌకకు ’బాహుబలి‘ పేరు పెట్టడంతో హీరో ప్రభాస్, బాహుబలి చిత్ర దర్శకనిర్మాతలు ఇస్రోకు ప్రత్యేక కృతజ్జతలు తెలిపారు. భారతీయులకు మాకు ఇది నిజంగా పండగ దినమే అని పేర్కొన్నారు. ఈ వాహక నౌక మోసుకెళ్లిన చంద్రయాన్ ఉపగ్రహం బరువు 300 టన్నులు.